Pawan Kalyan Meets Union Minister: కేంద్రమంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ.. పోలవరం ప్రాజెక్ట్ గురించి వైసీపీపై ఫిర్యాదు
Pawan Kalyan Meets Union Minister Gajendra Singh Shekawath: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని... రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Pawan Kalyan Meets Union Minister Gajendra Singh Shekawath: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని.. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి జరిగే మేలు గురించి పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కి వివరించారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక ప్రయోజనాలు అందిస్తుందని, ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బ తింటోందని కేంద్రమంత్రి షెకావత్ దృష్టికి తీసుకువెళ్లారు. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదని కేంద్రమంత్రికి ఫిర్యాదుచేశారు.
విశాఖ పారిశ్రామిక జోన్‌కు అవసరమైన నీటినీ, విశాఖ మెట్రో నగరానికి తాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లకపోవడంపై వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని షెకావత్‌కి తెలిపారు. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్. అండ్ ఆర్. విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన శ్రద్ధ చూపడం లేదన్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు, మిగిలిన 24 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాజెక్ట్ మూలంగా విశాఖపట్నం, గోదావరి జిల్లాలకు తాగు నీరు, పారిశ్రామిక అవసరాలతోపాటు గోదావరి డెల్టాలోనే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా డెల్టాలోని రైతాంగానికి కూడా సాగు నీరు రూపంలో ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు అందించడంతోపాటు ఈ నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వ తక్షణణే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి వివరించారు.
Also Read: CSK vs LSG IPL 2023 match: హైయెస్ట్ పవర్ ప్లేలో చెన్నై రికార్డు.. లక్నోపై ధోనీ సేన గెలుపు
Also Read: PM Kisan Yojana: రైతులకు ముఖ్య గమనిక.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి