CSK vs LSG IPL 2023 Match Highlights: ఐపిఎల్ 2023 టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన 6వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐపిఎల్ 2023 ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైన కసితో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి ఆ లోటును పూడ్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ చేయడానికే మొగ్గుచూపడంతో ధోనీ సేన బ్యాటింగ్‌కి వచ్చింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వె ఆరంభంలోనే పరుగుల వరద పారించి చెన్నై చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కి అత్యధిక పవర్ ప్లే స్కోర్ (79/0 (6 ఓవర్లు) అందించారు. రుతురాజ్ గైక్వాడ్ అన్‌స్టాపబుల్‌గా కనిపించాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. ఈ సీజన్‌లో గైక్వాడ్‌కి ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా.. ఐపిఎల్ కెరీర్లో 12వ అర్థ శతకం.
రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగుల వద్ద ఉండగా రవి బిష్ణోయి బౌలింగ్‌లో మార్క్ ఉడ్ పట్టిన బ్రిలియంట్ క్యాచ్‌తో గైక్వాడ్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత మార్క్ ఉడ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్య పట్టిన క్యాచ్‌తో డెవన్ కాన్వె 47 పరుగుల వద్ద పెవిలియన్ బాటపట్టాడు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి లక్నో సూపర్ జెయింట్స్ ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.
లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఓపెనింగ్‌కి వచ్చిన కే.ఎల్. రాహుల్, కిలి మేయర్స్ సైతం ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. కిలీ కేవలం 21 పరుగుల్లోనే 53 పరుగులు చేసి .. ఐపిఎల్ చరిత్రలో ఐపిఎల్‌లోకి అడుగుపెట్టిన తరువాత వరుసగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ రెండు హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
అయితే, కిలీ ఔట్ అయిన అనంతరం రాహుల్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య.. ఇలా వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయారు. వరుసగా వికెట్లు పడగొట్టి చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ మ్యాచ్‌ని తమవైపు తిప్పుకుంది. అలా చతికిలపడిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చెన్నైపై గెలిచేందుకు చివరి వరకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల వద్దే లక్నో ఇన్నింగ్స్ ముగించింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది.
Also Read: Pawan Kalyan: కేంద్రమంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ.. వైసీపీపై ఫిర్యాదు
Also Read: Jupiter Rise 2023: మేషరాశిలో గురుడు ఉదయించడంతో..ఆ 5 రాశులకు దశ తిరిగిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి