వైజాగ్ : విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విష వాయువులు పీల్చుకున్న జనం, పసిబిడ్డలు ఎక్కడపడితే అక్కడే పడిపోయిన తీరు చూస్తే చాలా ఆందోళన కలిగించిందని అని అన్నారు. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడికి సమీపంలోని జన సైనికులు సాహసం చేసి బాధితులను రక్షించే ప్రయత్నం చేయడాన్ని తాను అభినందిస్తున్నట్టు తెలిపారు.