Srikalahasthi CI Anju Yadav: సీఐ అంజూ యాదవ్‌కి పవన్ కళ్యాణ్ వార్నింగ్
Srikalahasthi CI Anju Yadav Beating Janasena Party Leader: శ్రీకాళహస్తీలో జనసేన పార్టీకి చెందిన స్థానిక నేతపై అక్కడి సీఐ అంజూ యూదవ్ చేయి చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో పోలింగ్ ఎలాగూ చేసుకోనియ్యరు. కనీసం శాంతియుతంగా కూడా మా నాయకులను నిరసనలు చేసుకోనివ్వరా అంటూ పోలీసులపై మండిపడ్డారు.
Srikalahasthi CI Anju Yadav Beating Janasena Party Leader: శ్రీకాళహస్తీలో జనసేన పార్టీకి చెందిన స్థానిక నేతపై అక్కడి సీఐ అంజూ యూదవ్ చేయి చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తీ సిఐ అంజూ యాదవ్ తమ పోలీసు సిబ్బందితో కలిసి జనసేన పార్టీ నాయకులపై దౌర్జన్యంగా చేయి చేసుకున్న ఘటనపై పవన్ కళ్యాణ్ మా జనసైనికులను కొడితే నన్ను కొట్టినట్టే అని అన్నారు. జనసేన నేతని సీఐ అంజూ యూదవ్ అకారణంగా కొట్టారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా సీఐ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన పవన్ కళ్యాణ్.. తానే స్వయంగా శ్రీకాళహస్తికి వస్తానని, శాంతియుత ధోరణిలో నిరసనలు చేసే ప్రజాప్రతినిధులను కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారో అక్కడే తేల్చుకుంటాను అంటూ సీఐ అంజూ యాదవ్‌కి వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో పోలింగ్ ఎలాగూ చేసుకోనియ్యరు. కనీసం శాంతియుతంగా కూడా మా నాయకులను నిరసనలు చేసుకోనివ్వరా అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోలీసులపై మండిపడ్డారు.
ఇదిలావుంటే, ఈ ఘటనపై ఇప్పటికే జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ట్విటర్ ద్వారా ఏపీ డీజీపికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న జనసేన నాయకుడిపై అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారిణి తీరును నాదెండ్ల మనోహర్ తీవ్రంగా తప్పుపట్టారు.
ఇది కూడా చదవండి : Pawan Kalyan to AP CM YS Jagan: తండ్రి చనిపోయిన బాధలో హీరో మహేష్ బాబు ఉంటే.. అక్కడికి వెళ్లి నవ్వుతావా ?
సీఐ అంజూ యాదవ్ వ్యవహార శైలిని అందరూ ఖండించాలి అని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. వైసీపీ సొంత ప్రయోజనాలకు నిరసనలకు దిగితే బందోబస్తు ఏర్పాటు చేసే పోలీసులు.. మానవ హక్కుల గురించి మరచిపోయారా ? అని ట్విటర్ ద్వారానే ఏపీ పోలీసులను నిలదీశారు. సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ తన ట్వీట్‌లో ఏపీ డీజీపిని ట్యాగ్ చేశారు. మొత్తానికి ఈ ఘటన శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నేతలను మానసికంగా కొంత ఆందోళనకు గురిచేసింది. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన వారిలో కొంత మనోధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి : AP Early Polls: ఏపీలో ముందస్తు ఎన్నికలు, క్లారిటీ ఇచ్చేసిన వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK