Pawan Kalyan Sensational Comments : ఏపీ డిప్యూటీ సీఎం హిందూ మతంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని కాపాడుకోవడం మన ప్రాథమిక హక్కు పవన్ కళ్యాణ్ అన్నారు. హిందూ మతం గొప్పదని అన్నంత మాత్రాన ఇతర మతాలను అవమానించినట్లు కాదు కదా అని ప్రశ్నించారు. ఒక మతం వాళ్లు ఇతర మతాన్ని కించపరచడం సబబు కాదన్నారు పవన్ కళ్యాణ్‌. హిందువు మతం అంటే కొందరికి చులకన భావం ఏర్పడింది. మైనార్టీలను ఎవరైనా ఏమంటే ఊరుకుంటారా..అదే మరి హిందూ మతంపై దాడి జరుగుతుంటే మాత్రం చేష్టలుడిగి చూడం కరెక్ట్ అని పవన్ ప్రశ్నించారు. ఐక్యతతో  హిందువులపై జరుగుతున్న దాడిని అడ్డుకోవాలని పవన్ పిలుపు నిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాదు తిరుమల లడ్డు విషయంలో కూడా పవన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గత జగన్ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదం నాణ్యత తగ్గిందని భక్తులు తన దృష్టికి తెచ్చారని అన్నారు. గత ప్రభుత్వం తిరుమలను ఒక బిజినెస్ కోణంలో ,ఆదాయ వనరుగా చూడడం భాధాకరం. తిరులమ అనేది కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. అలాంటి తిరుమలను జగన్ రాజకీయాలకు అడ్డాగా మార్చారని విమర్శించారు. అంతే కాదు టీటీడీలో అన్యమతస్తులు ఉండడం కరెక్ట్ కాదన్నారు. వక్ఫ్ బోర్డుపై కూడా పవన్ సంచలన కామెంట్స్ చేశారు. ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంటే మరి హిందువులకు ఉంటే తప్పేందన్నారు. హిందువుల ఆలయాలను ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా మార్చుకోవడం బాధాకరం అన్నారు. 


Also read: Ys Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.