Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్... పవన్ కళ్యాన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే..?
pawan kalyan on allu arjun issue: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలోని అన్నమయ్య జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అల్లు అర్జున్ అరెస్ట్ పై విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తొంది.
Pawan Kalyan reacts on allu arjun arrest: పుష్ప2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రస్తుతం 18 మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ ఈ ఘటనలో ఇప్పటికే బెయిల్ మీద బైట ఉన్నారు. ఈ ఘటన ఒకవైపు రాజకీయంగా మరొవైపు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ ఘటనపై ఇటీవల దేశ వ్యాప్తంగా పెనుదుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలొ కొందరు బన్నీని సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు తప్పు పట్టిన వారు సైతం ఉన్నారు.
అయితే.. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం.. తెలుగు ఇండస్ట్రీపైన ఒంటికాలిపై లేచీనట్లు తెలుస్తొంది. మొత్తంగా అల్లు అర్జున్ ఎపీసోడ్ మాత్రం తెలుగు స్టేట్స్ లలో రాజకీయంగా దుమారంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య బేధాభిప్రాయాలపై వస్తున్న రూమర్స్ లలో నిజంలేదని తెలిపోయినట్లు సమాచారం. అయితే ఈ ఘటన తర్వాత చిరు, నాగబాబు.. బన్నీని కలిశారు.
బన్నీ కూడా చిరు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తొంది. అయితే.. పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్లు చేయలేదు. తాజాగా, పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై దాడి ఘటనపై ఆయనను పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడాగా.. కొంత మంది అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ ను ప్రశ్నించారు . దీనిపై ఆయన మాట్లాడుతూ..ఇది సంబంధలేని ప్రశ్నఅని అన్నారు.
ఇక్కడ మనుషులు చనిపోతే.. సినిమాల గురించి చర్చలు ఇప్పుడేందుకు అన్నట్లు తెలుస్తొంది. పెద్ద సమస్యల గురించి మాట్లాడాలని చెప్పినట్లు సమాచారం . దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంటే.. దీన్ని పవన్.. బన్నీ అరెస్ట్ ను చాలా.. చిన్న విషయంలా భావిస్తున్నారా.. అసలు పవన్ .. బన్నీని అరెస్ట్ చేసి దేశంలో ఇంతలా చర్చలు జరిగితే.. అదేం పట్టనట్లు ఆయన స్పందించినతీరు ప్రస్తుతం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter