Pawan Kalyan Visits Rushikonda : సీఎం జగన్‌కు ఎన్ని ఇళ్లు కావాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ ఇల్లు నిర్మిస్తాడా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ నిలదీశారు. పోలీసుల ఆంక్షల మధ్యే శుక్రవారం విశాఖలో తన పర్యటన కొనసాగించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎట్టకేలకు ఆంక్షల మధ్యే రుషికొండను కూడా పరిశీలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుషికొండ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ ఉత్తరాంధ్రను వైసీపీ పాలకులు దోపిడీ చేస్తున్నారు అని మండిపడ్డారు. రుషికొండపై నిర్మాణాలకు పర్యావరణ శాఖతో పాటు సంబంధిత విభాగాల నుంచి రావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయా అని ప్రభుత్వాన్ని పరిశీలించారు. విశాఖలో తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ నగరాన్ని అడ్డుగా నిలబడి కాపాడుతుంది. అలాంటి రుషికొండను నిర్మాణాల పేరుతో తగ్గించేస్తే ఆ తరువాత ఎదురయ్యే ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ ఎలా ఉంటుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుషి కొండ నిర్మాణం అంతా పుర్తిగా నిబంధనలు ఉల్లంఘించి చేపడుతున్నవే అవి పవన్ కళ్యాణ్ ఆరోపించారు.


ఈ సందర్భంగా ఏపీ సర్కారుపైన, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్ కళ్యాణ్.. ఉత్తరాంధ్రలో ఎన్నో విలువైన భూములు, ప్రకృతి సంపద దాగి ఉందని.. వాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కళ్లు పడ్డాయి అని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గతంలో తెలంగాణలో కూడా ఇలాగే భూములు, విలువైన సంపద అంతా ఇలాగే దోచేశారు. దాంతో ఆంధ్రావాళ్లే తమ సంపదను దోచుకుపోతున్నారు అనే భావనలోకి వచ్చిన తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. 


ఇది కూడా చదవండి : YSR Sunna Vaddi Scheme: అకౌంట్‌లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి..!


జగన్‌కు ఇంకా ఎన్ని ఇళ్లు కావాలి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ దోచేశాడు అని.. అలాగే ఉత్తరాంధ్రపై కూడా పడ్డారు అని ఏపీ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ ఈ పరిణామాలు అన్నింటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనన్నారు. చట్టాలు కాపాడివలసిన ముఖ్యమంత్రే చట్టాలను ఉల్లంఘిస్తున్నారు అని తెలుసుకోవాలి అని సూచించారు. ఇక్కడి ప్రజలు శాంతి యుతంగా ఉండటంతో వైఎస్ జగన్ సర్కార్ అన్యాయం చేస్తూ ఇక్కడి ప్రజలను, ఆస్తులను దోచుకుంటోంది అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.


ఇది కూడా చదవండి : Ambati Rambabu: 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు..' మంత్రి అంబటి ఇంట్రెస్టింగ్ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి