YSR Sunna Vaddi Scheme: అకౌంట్‌లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి..!

YSR Sunna Vaddi Scheme Eligibility 2023: రాష్ట్రంలో అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు చూసి.. ప్రతిపక్షాల ప్యూజులు ఔట్ అయ్యాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 11, 2023, 02:55 PM IST
YSR Sunna Vaddi Scheme: అకౌంట్‌లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి..!

YSR Sunna Vaddi Scheme Eligibility 2023: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం జనుపల్లిలో నాల్గో ఏడాది వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ డబ్బులను బటన్ నొక్కి జమ చేశారు. 1,05,13,365 మంది డ్వాక్రా మహిళలకు రూ.1,354 కోట్లను జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇళ్లలో మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే.. మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అన్నారు. ఇప్పటివరకు సున్నావడ్డీ పథకం ద్వారా ఈ నాలుగేళ్లలో రూ.4,969 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

==> 9,48,122 మంది పొదుపు సంఘాల గ్రూపులకు వాళ్లు తీసుకున్న రుణాల మీద కోటి 5 లక్షల 13 వేల 365 మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ వారి రుణాలను సున్నా వడ్డీగా చేరుస్తూ.. వారు కట్టిన రుణాలకు వడ్డీని 1350 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది. 
==> గత ప్రభుత్వంలో 2014-2019 మధ్య అప్పట్లో పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి అప్పట్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. 14,205 కోట్లు అప్పట్లో చెల్లించకుండా మోసం చేశాడు.
==> 2016లో ఈ పెద్ద మనిషి అక్కచెల్లెమ్మలకు కట్టాల్సిన సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేయడం ఇంకో దారుణం. 
==> చంద్రబాబు హయాంలో జరిగిన ఘోరాన్ని తలచుకుంటే బాధనిపిస్తుంది. 
==> పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు చేసిన మోసానికి ఏ గ్రేడ్‌, బీ గ్రేడ్‌ సంఘాలుగా ఉంటే సీ గ్రేడ్‌కు, డీ గ్రేడ్‌కు దిగజారిపోయిన పరిస్థితులు కనిపించాయి. 
==> 2016 అక్టోబర్‌ నుంచి సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకపోవడంతో అక్కచెల్లెమ్మలు 3036 కోట్లు ఎదురు కట్టాల్సి వచ్చింది. 
==> అది వారి చరిత్ర. అదీ నారా వారి చరిత్ర. అదీ నారీ వ్యతిరేక చరిత్ర అన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతున్నా. 
==> ఈ రోజు పొదుపు సంఘాల్లో మొండి బకాయిలు చూస్తే కేవలం 0.3 శాతం. ఎక్కడ 18.36 శాతం, ఎక్కడ 0.3 శాతం ఆలోచన చేయాలి. 
==> రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి 
==> గతంలో 12 నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేస్తున్న పరిస్థితులతో ఆ బ్యాంకు వాళ్లతో మాట్లాడి కన్విన్స్‌ చేశాం. 
==> 9.5 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గించగలిగాం. 
==> అప్పుల ఊబిలో నుంచి అక్కచెల్లెమ్మలను బయటకు తీసుకొచ్చాం. 
==> మహిళా పక్షపాత ప్రభుత్వంగా 50 నెలల కాలంలో మనం అమలు చేసిన పథకాలను మచ్చుకు కొన్నింటిని వివరిస్తా. 
==> దేశ చరిత్రలోనే ఏ ఇతర రాష్ట్రంలో జగనన్న అమ్మ ఒడి పథకం లేదు. 
==> వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45-65 వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 26.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించిన సాయం 14219 కోట్లు. 
==> నా అక్కచెల్లెమ్మల కోసం, బాగుండాలని అనే తలంపుతో వైఎస్సార్‌ కాపు నేస్తం తీసుకొచ్చాం. 
==> ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కాబట్టే ప్రతిపక్షానికి దిక్కు తోచడం లేదు. 
==> వారి మైండ్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. 
==> చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అసలు సామాజిక న్యాయం ఉందా? అని అడుగుతున్నా. 
==> చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎప్పుడైనా పేదల చేతిలో ఉంచాడా..? 
==> ప్రతి స్థలంలోనూ ఇళ్లు కట్టించే ప్రయత్నం ఈ 75 సంవత్సరాల ముసలాయన ఎప్పుడైనా చేశాడా..? 
==> చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి దత్త పుత్రుడు ఎందుకు పరుగెడుతున్నాడని అడుగుతున్నా. 
==> దత్తపుత్రుడు సీఎం కావడానికి కాదట. ఇలాంటి చంద్రబాబును సీఎం చేయడానికట.
==> ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతుందా..? ఆలోచన చేయమని కోరుతున్నా.. 
==> రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు, అబద్ధాలు ఎక్కువ అవుతాయి. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తామని చెబుతారు. 
==> ఎలాంటి మనిషి మీకు నాయకుడిగా కావాలని ఆలోచన చేయండి.. అని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.

Also Read: Bhola Shankar Ticket Price: భోళా శంకర్‌ టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఎందుకు రాలేదు..? అసలు కారణాలు ఇవే..!  

Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News