Pawan Kalyan vs Volunteers: వారాహి రెండవ విడత యాత్రలో భాగంగా ఏలూరులో జనసేనాని పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వాలంటీర్లు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మల్ని దగ్దం చేశారు. ప్రముఖులు సైతం పవన్ వైఖరిని తప్పుబడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్‌పై నిప్పులు చెరిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఏపీలోని వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, మహిళలతో వ్యాపారం చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా, వితంతువులున్నారా లేదా అనే వివరాల్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడమే కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపాయి. 


పవన్‌కు వ్యతిరేకంగా వాలంటీర్లు నిరసన చేపట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అప్పటి వరకూ వెనక్కి తగ్గేది లేదని వాలంటీర్లు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మల్ని, ఫ్లెక్సీలు దగ్దగం చేశారు. ప్రముఖులు సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఇలా మాట్లాడకూడదని హితవు పలుకుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. 


పవన్ కళ్యాణ్ ఇంత నీచాతినీచంగా  మాట్లాడతాడని ఊహించలేదన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. అతడి వ్యాఖ్యల్ని చూస్తూ ఊరుకోవల్సిన అవసరం లేదన్నారు. మనుషులు అక్రమ రవాణా వ్యవయహారాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని, సమగ్ర విచారణ జరిపించాలని చెప్పారు. వాలంటీర్లు వేలాదిమంది మహిళల్ని అక్రమంగా రవాణా చేశారంటూ పవన్ చెప్పడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని తమ్మారెడ్డి సూచించారు. వాలంటీర్లపై ఇంత నీచంగా మాట్లాడితే చూస్తూ ఎందుకు ఊరుకోవాలని ప్రశ్నించారు. వేలాదిమంది మహిళలు అదృశ్యమౌతుంటే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆపకుండా ఎలా ఉంటాయన్నారు. 


అసలు రాష్ట్రంలో వాలంటీర్లు వేతనాల కోసం పనిచేయడం లేదనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. వాలంటీర్ల కారణంగా సమాజంలో చాలా మార్పులు వస్తూ మేలు జరుగుతోందన్నారు. అలాంటి వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ సమర్ధించడం లేదన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.  వాలంటీర్లు అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించడం పవన్ కళ్యాణ్ స్తాయికి తగదన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం రాజకీయ నాయకుడి లక్షణం కాదన్నారు. 


Also read; AP Volunteers: వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల దుమారం, జనసేనానికి మహిళా కమీషన్ నోటీసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook