సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ స్థాపించి మార్చి 14వ తేదీకి నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అదే రోజున జనసేన పార్టీ భారీ బహిరంగ సభకు ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సందర్భాన్ని ఓ బహిరంగ సభలా జరపాలా లేక పార్టీ ప్లీనరిలా జరపాలా అనే విషయంలోనే అంతర్గతంగా నేతలు ఇంకా ఓ కొలిక్కి రాలేదనే టాక్ వినిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ ఆవరణలో ఈ ఈవెంట్ జరపనున్నట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చర్చించే వేదికగా ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా పార్టీకి సంఖ్యాపరంగా ఇంకా నేతలు కూడా ఎక్కువగా లేనందున ప్లీనరి కన్నా బహిరంగ సభ నిర్వహణ వైపే ఎక్కువగా మొగ్గుచూపే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.