Payakaraopeta Assembly Constituency: ఏపీలో రాజకీయాలు లెక్కలు మొదలయ్యాయి. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులతో వైసీపీని ఓడించేందుకు సిద్ధమవుతుండగా.. ఒంటరిగానే ప్రతిపక్షాలకు మరోసారి చెక్ పెట్టేందుకు సిద్ధం అంటూ సీఎం జగన్ రెడీ అయ్యారు. ఇక ఉత్తరాంధ్రలో అన్ని సీట్లు ఒక లెక్క అయితే.. పాయకరావుపేట మరో లెక్కగా మారింది. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత బరిలో ఉంటున్నారు. ఆమెను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలనే లక్ష్యంతో వైసీపీ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు మహిళా అధ్యక్షురాలి హోదాలో వంగలపూడి అనిత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ అగ్ర నాయకులే టార్గెట్‌గా వ్యక్తిగత విమర్శలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Redmi 12C Vs Redmi 13C: ఈ రెండు మొబైల్స్‌ మధ్య ఉన్న ఊహించని తేడాలు ఇవే..  


2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనితకు సొంతపార్టీలోనే తీవ్ర వ్యతిరేకత పెరిగింది. 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసినా.. పార్టీలో నేతల విభేదాలతో ఆమె పరాజయం పాలయ్యారు. ఓటమి తరువాత పాయకరావుపేట నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. ఐదేళ్లుగా ఈ నియోజకవర్గం నుంచే ఆమె రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో వైసీపీ అధిష్టానం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు రాజ్యసభ ఎంపీగా ప్రమోషన్ ఇచ్చింది. అనితపై సీనియర్ ఎమ్మెల్యే కంబాల జోగులును పోటీలో నిలబెట్టింది. వివాదరహితుడిగా పేరున్న సీనియర్ ఎమ్మెల్యేను బరిలోకి దింపితే విజయం ఖాయమని సంకేతాలు పంపించింది.


ఈ నియోజకవర్గంలో కోటవురట్ల, పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాలు ఉండగా.. ఇక్కడ SC, కాపు, మత్స్యకార, ఇతర BC కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ మొదటి నుంచి టీడీపీకి ఓటర్లు మద్దతుగా ఉండగా.. గత ఎన్నికల్లో వైసీపీ తనవైపు తిప్పుకుంది. మరోసారి విజయం సాధించేందుకు ప్రతి మండలంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పాయకరావుపేట మండలంలో మంత్రి దాడిశెట్టి రాజా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. కోటవురట్ల మండలంలో పట్టున్న మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజుకు ఎంఎస్ఎంఈ  కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు ఇచ్చారు. 


అధికార పార్టీ నేతలు వైఖరిని పసిగట్టిన టీడీపీ.. అనితకు మద్దతుగా నిలుస్తోంది. కాపు సామాజికవర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో జనసేన నాయకులను రంగంలోకి దింపింది. అదేవిధంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టిన ఆయన.. అనితను వ్యతిరేకిస్తున్న వర్గాలను ఒప్పించడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పాయకరావుపేట రాజకీయాలు రసరవత్తరంగా మారాయి. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి మరి.  


Also Read: Mukesh Ambani: ముకేశ్ అంబానీ చదువుకున్న స్కూల్ ఇదే.. అప్పట్లో ఫీజు ఎంత చెల్లించేవారో తెలిస్తే ఫ్యూజులు అవుట్..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter