Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలో అత్యంత ఖరీదైన పాఠశాలల్లో గ్వాలియర్‌లోని సింధియా స్కూల్ ఒకటి. ఇందులో ఇప్పటివరకు చాలామంది వ్యాపారవేత్తలు చదువుకున్నారు. భారతదేశంలోని బడా వ్యాపారి ముఖేష్ అంబానీతో పాటు బాలీవుడ్ ఆగ్రహం సల్మాన్ ఖాన్ లాంటి చాలామంది ప్రముఖులు ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఈ పాఠశాలకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇందులో చదువుకున్న వారంతా పెద్ద పెద్ద వ్యాపారాల్లో స్థిరపడడమే కాకుండా ఉన్నత హోదాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలకు సంబంధించిన ఫీజు, ఇతర వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ స్కూల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సింధియా స్కూల్ చరిత్ర:
గ్వాలియర్‌లోని సింధియా పాఠశాలను 1000 సంవత్సరాలు కలిగిన పురాతనమైన కోటలో ఎంతో లగ్జరీగా నిర్మించారు. అంతేకాకుండా దీన్ని అప్పట్లో బాలుర బోర్డింగ్ పాఠశాలగా పిలిచేవారట. దీనిని సింధియాకు చెందిన మాధవరావు మహారాజు 1897లో ప్రారంభించారు. అప్పట్లో ఈ పాఠశాలలో అందరికీ అడ్మిషన్ ఇచ్చేవారట. అలాగే ఈ పాఠశాలలో వివిధ నగరాలకు చెందిన వ్యాపారవేత్తల కొడుకులు కూడా చదువుకునేవారని సమాచారం. ఈ స్కూల్లో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీతో పాటు సల్మాన్ ఖాన్, సూరజ్ బర్జాతియా, అనురాగ్ కశ్యప్, అలీ అస్గర్, అనేక మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు చదువుకున్నారు.
ఈ స్కూల్లో ప్రవేశం పొందడానికి కావలసిన వయస్సు పరిమితి:
ఈ స్కూల్లో కేవలం 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలు ఉంటాయి. ఈ తరగతుల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థుల వయస్సు 11 నుంచి 13 సంవత్సరాలు ఉన్నవారికి అడ్మిషన్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్కూల్లో చదివి ఫెయిల్ అయిన వారికిపై తరగతుల్లో ప్రవేశం ఉండదు. ప్రతిభావంతులైన వారికి ఈ పాఠశాలలో ముందు తరగతులకు ప్రవేశం ఉంటుందని సమాచారం. అయితే ఈ స్కూల్లో అడ్మిషన్ పొందడానికి ముందుగా స్కూలుకు సంబంధించిన సింధియా స్కూల్ అడ్మిషన్ కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CAA) ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఈ టెస్టులో భాగంగా ఎంపికైన వారికే స్కూల్లో అడ్మిషన్ లభిస్తుందట. అలాగే ఈ ఆప్టిట్యూడ్ అసెస్‌మెంట్‌లో భాగంగా మొత్తం నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలపై ఎగ్జామ్ ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన సెంటర్లు ముంబై తోపాటు న్యూఢిల్లీ, లక్నో, కలకత్తా వంటి ప్రధాన నగరాల్లో ఉన్నాయి.
స్కూల్ ఫీజు ఎంత?
ఈ స్కూల్లో ఫీజును పాఠశాల అధికారులు రెండు రకాలుగా విభజించారు. ఇతర దేశానికి సంబంధించిన విద్యార్థులకైతే సంవత్సరానికి ఆనాటి కాలంలోనే రూ.15,30,700 చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారతీయులకు అయితే ఈ పాఠశాలలో చదవాలనుకునే విద్యార్థులకు రూ. 13,25,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారత సైనిక దళంలో పనిచేసే వారికి పిల్లలకు మాత్రం కొంత తగ్గింపుతో కేవలం సంవత్సరానికి రూ. 8,50,000 ఫీజు ఉండేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఫీజు సంవత్సరానికి ఒక్కసారైనా మారేదని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి