వరుసగా 14వ రోజూ ధరలు పైపైకి...
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వరుసగా 14వ రోజు కొనసాగింది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వరుసగా 14వ రోజు కొనసాగింది. సోమవారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ₹82.91కి (విజయవాడలో లీటర్ పెట్రోల్ ₹84.49, డీజిల్ ₹76.47) చేరింది. డీజిల్ ధర ₹75.18కి చేరుకుంది. కర్నాటక ఎన్నికల వరకు స్థిరంగా ఉన్న ధరలు ఆ తర్వాత ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అమాంతం పెరుగుతున్న కారణంగా, దేశీయంగానూ చమురు ధరలకు రెక్కలు వచ్చాయి.
ఆయిల్ కంపెనీలపై నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారం పెట్రోల్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. వీటిపై కేంద్రం స్పందన కూడా అంతంతమాత్రంగానే ఉంది. పెట్రో మంట సరకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాంతో కూరగాయలు, నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెంచేటప్పుడు మాత్రం భారీ స్థాయిలో పెంచుతూ ధరలను తగ్గించే సమయంలో మాత్రం స్వల్ప మొత్తంలో తగ్గిస్తుండటం ఆనవాయితీగా మారిందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర ₹78.27, డీజిల్ ధర ₹69.17గా, ముంబైలో లీటర్ పెట్రోలు ధర ₹86.08, డీజిల్ ధర ₹73.64గా ఉంది.హైదరాబాద్‌లో గత పది రోజులుగా పెట్రోల్ ధరల పెంపు ఈ విధంగా ఉంది.
మే 17, 2018- ₹79.78
మే 18, 2018- ₹ 80.09
మే 19, 2018- ₹ 80.41
మే 20, 2018- ₹ 80.76
మే 21, 2018- ₹ 81.11
మే 22, 2018- ₹ 81.43
మే 23, 2018- ₹ 81.75
మే 24, 2018- ₹ 82.07
మే 25, 2018- ₹ 82.45
మే 26, 2018- ₹ 82.60
మే 27, 2018- ₹ 82.76
మే 28, 2018- ₹ 82.91