చంద్రబాబుకు చిక్కులు; సీబీఐ వద్ద ఆడియో టేప్!
అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన టిడిపి ఎంపీ అశోక్ గజపతిరాజు ఉన్న సమయంలో ఈ ప్రస్తావన వచ్చిందట.
'ఏపీ సీఎం చంద్రబాబుతో సఖ్యంగా ఉంటే ప్రతీదీ వస్తుంది' అని ఇద్దరు విమాన సంస్థల పెద్దలు మాట్లాడుకున్న సంభాషణల టేప్ ఒకటి కలకలం సృష్టిస్తోంది. ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జికూటివ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్, ఇండియా ఎయిర్‌లైన్స్ సీఈవో మిట్టు శాండిల్య మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఈ ఆడియో టేప్ ప్రస్తుతం సీబీఐ వద్ద ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
కాగా 2015-16లో కొందరు పౌరవిమానయాన శాఖ అధికారులకు లంచాలు ఇచ్చిన కేసులో టోనీ ఫెర్నాండెజ్‌పై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మిట్టూతో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబుతో సఖ్యతగా ఉంటే ఏ పని అయినా అయిపోతుందని అన్నారని సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చిందని ఓ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన టిడిపి ఎంపీ అశోక్ గజపతిరాజు ఉన్న సమయంలో ఈ ప్రస్తావన వచ్చిందట. అంతర్జాతీయ రూట్ లైసెన్స్ కోసం ఆ సంస్థ ప్రయత్నాలు చేసిన సమయంలో ఈ చర్చ జరిగిందని కథనంలో ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను ఎయిర్ ఏషియా తిరస్కరించింది.