PM MODI AP TOUR: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయా? రాబోయే రెండు నెలల్లో అద్భుతాలు జరగనున్నాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసింది బీజేపీ. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ అమిత్ షాలు 10 రోజుల వ్యవధిలోనే రెండ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అధికారిక పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. ముందు షెడ్యూల్ లో లేకపోయినా బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అక్కడే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ జాతీయ నేతలు తమ ప్రసంగాల్లో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమని చెప్పి కేడర్ లో ఫుల్ జోష్ నింపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ బాటలోనే ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. వరుసగా జాతీయ నేతలు అంధ్రాలో పర్యటించబోతున్నారు. జూన్ 7న రాజమహేంద్రవర్గంలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు జేపీ నడ్డా హాజరవుతున్నారు. తాజాగా ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. జూలై4న పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అక్కడ నిర్వహించనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన వివరాలను అధికారికంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమంతో పాటు పార్టీ నేతలతో సమావేశం అవుతారని సోము వీర్రాజు చెప్పారు. నెల రోజుల్లోనే ఏపీకి బీజేపీ అగ్ర నేతలు రానుండటం రాజకీయంగా ఆసక్తిగా మారింది.


ఏపీలో కొన్ని రోజులుగా పొత్తులపైనే ప్రధాన చర్చ సాగుతోంది. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతాయని.. 2014 తరహాలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వరుసగా చేస్తున్న కామెంట్లు ఇందుకు బలాన్నిస్తున్నాయి. అయితే టీడీపీతో పొత్తు ఉంటుందనే సిగ్నల్ జనసేన చీఫ్ ఇస్తుండగా.. జనసేన మిత్రపక్షం బీజేపీ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. తమకు జనసేనతోనే పొత్తు ఉంటుందని టీడీపీతో కలవబోమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సహా కొందరు కమలం నేతలు చెబుతున్నారు. మరికొందరు ఏపీ బీజేపీ లీడర్లు మాత్రం మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరును జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించబోతున్నారనే ప్రచారం సాగుతోంది.


పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే రాజమహేంద్రవరంలో జేపీ నడ్డా సభను పెట్టారని అంటున్నారు. గోదావరి జిల్లాలో పవన్ కు గట్టి పట్టుంది. అందుకే రాజమహేంద్రవరం వేదికగా బీజేపీ కీలక ప్రకటన చేయబోతుందని తెలుస్తోంది. ఇప్పుడు ప్రధాని మోడీ టూర్ ఖరారు కావడంతో.. ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. బీజేపీ-జనసేన నేతలకు ప్రధాని మార్గనిర్దేశం చేస్తారని.. త్వరలోనే అమిత్ షా కూడా వస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా  బీజేపీ కార్యక్రమాలతో రానున్న రెండు నెలల్లో ఏపీలో సంచలనాలు జరగడం ఖాయమని అంటున్నారు.


READ ALSO: MLC Ananthababu: హత్యకు గురైన కారు డ్రైవర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. ఎమ్మెల్సీ అనంతబాబును సేఫ్ చేస్తున్నారా?


READ ALSO: Tax Increase: ఇదేం బాదుడయా సీఎం! గుట్టుచప్పుడుకాకుండా ట్రాన్స్ పోర్ట్ ట్యాక్స్ హైక్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook