Tax Increase: ఇదేం బాదుడయా సీఎం! గుట్టుచప్పుడుకాకుండా ట్రాన్స్ పోర్ట్ ట్యాక్స్ హైక్

Tax Increase: ఇప్పటికే పరిమితికి మంచి అప్పులు... కొత్తగా రుణం దొరికే పరిస్థితి లేదు.. మే నెలాఖరు వచ్చేసింది.. మూడు రోజుల్లో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి.. కాని ఖజానా ఖాళీ.. జీతాలు చెల్లించాలంటే కొత్తగా అప్పు పుట్టాల్సిందే.. కాని కొత్త రుణం తీసుకోవడంపై కేంద్రం కొర్రీలు... ఇలాంటి దుర్భర ఆర్థిక పరిస్థితుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం

Written by - Srisailam | Last Updated : May 29, 2022, 10:26 AM IST
  • వాహనదారులపై కేసీఆర్ సర్కార్ మరో భారం
  • గుట్టుచప్పుడుకాకుండా ట్రాన్స్ పోర్ట్ ట్యాక్స్ హైక్
  • కేసీఆర్ సర్కార్ తీరుపై ప్రజలు ఫైర్
Tax Increase: ఇదేం బాదుడయా సీఎం! గుట్టుచప్పుడుకాకుండా ట్రాన్స్ పోర్ట్ ట్యాక్స్ హైక్

Tax Increase: ఇప్పటికే పరిమితికి మంచి అప్పులు... కొత్తగా రుణం దొరికే పరిస్థితి లేదు.. మే నెలాఖరు వచ్చేసింది.. మూడు రోజుల్లో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి.. కాని ఖజానా ఖాళీ.. జీతాలు చెల్లించాలంటే కొత్తగా అప్పు పుట్టాల్సిందే.. కాని కొత్త రుణం తీసుకోవడంపై కేంద్రం కొర్రీలు... ఇలాంటి దుర్భర ఆర్థిక పరిస్థితుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. కేంద్ర సర్కార్ కొర్రీలు, ఆర్బీఐ ఆంక్షలతో కొత్త అప్పు దొరికే పరిస్థితి లేకపోవడంతో.. ఆర్థిక గండం నుంచి గట్టేక్కెందుకు మరో మార్గం ఎంచుకుంది కేసీఆర్ సర్కార్. ప్రజలపై ఎడాపెడా పన్నుల భారం వేయడమే సమస్యకు పరిష్కారంగా భావిస్తోంది. అందుకే గుట్టుచప్పుడు కాకుండా పన్నులు పెంచేస్తోంది. బిల్లు కట్టేంతవరకు ట్యాక్స్ పెరిగిన విషయం వినియోగదారులకు తెలియడం లేదంటే... కేసీఆర్ సర్కార్ తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా వాహనాలపై పన్నులను భారీగా పెంచేసింది కేసీఆర్ ప్రభుత్వం. ట్రాన్స్ పోర్ట్, కమర్షియల్ వాహనాలపైనా భారం మోపింది రవాణాశాఖ. గూడ్స్ లారీలు, ట్యాక్సీలు, క్యాబ్ లే కాదు స్కూల్ పిల్లల బస్సులను వదల్లేదు. అన్ని రకాల ట్రాన్స్ పోర్టు వెహికిల్స్ పై ట్యాక్స్ పెంచింది కేసీఆర్ సర్కార్. ఇందుకు సంబంధించిన కనీస సమాచారం కూడా వినియోగదారులకు లేదు. ట్యాక్స్ కట్టేందుకు మీ సేవా కేంద్రాలు, ఆన్ లైన్ లో చూసినప్పుడు.. పన్ను పెరిగిన విషయం తెలుస్తోంది. స్థానిక అధికారులకు కూడా ఈ విషయంపై సమాచారం లేదంటే షాక్ కావాల్సిందే. పెరిగిన పన్నుపై వాహనదారులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోకల్ అధికారులు పరేషాన్ అవుతున్నారు. క్షేత్ర స్థాయి అధికారులకు కూడా సమాచారం లేకుండా ప్రభుత్వం పన్నులు పెంచడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇటీవలే వాహనాల లైఫ్ ట్యాక్స్ మొత్తాన్ని భారీగా పెంచింది కేసీఆర్ సర్కార్.ఇప్పుడు వాణిజ్య వాహనాల పన్ను పెంచేసింది. అటు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చమురు ధరల పెంపుతో గగ్గోలు పడుతున్న  వాహనాదారులు.. తాజా భారంతో తల్లడిల్లిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5.70 లక్షల రవాణా వాహనాలున్నాయి. మరో లక్షన్నర వరకు క్యాబ్ లు, మ్యాక్సీ క్యాబులున్నాయి. విద్యాసంస్థల బస్సులు సుమారు 27 వేలు ఉన్నాయి. వీటికి ప్యాసింజర్ వాహనాలు అదనం. అన్ని రకాల రవాణా వాహనాలపై భారం వేసింది. కొన్ని రకాల వాహనాలపై పన్నుల పెంపు 20 శాతం వరకు ఉండగా, మరికొన్నింటిపై అంతకుమించే పెరిగినట్లు తెలుస్తోంది. స్కూల్ మినీ బస్సులపై గతంలో పన్ను 775 రూపాయలు ఉండగా.. ఇప్పుడది రూ.910కి పెరిగింది. పెద్ద బస్సులపై పన్ను రూ.1396 నుంచి రూ.1750కి పెంచేశారు. నేషనల్ పర్మిట్ తీసుకున్న బస్సులోని ప్రతి సీటుకు గతంలో రూ.3675గా ఉన్న మొత్తాన్ని నాలుగు వేలు చేశారు. రాష్ట్ర పరిధిలో తిరిగే బస్సులోని ప్రతి సీటుకు పన్ను గతంలో రూ.2625కాగా ఇప్పుడు దాన్ని ఏకంగా నాలుగు వేలకు హైక్ చేశారు.

ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్ గఢ్ తో  పోల్చితే వాహనాలపై పన్నులు తెలంగాణలోనే ఎక్కువ. పెట్రోల్, డీజిల్ పై కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. కాని కేసీఆర్ సర్కార్ పైసా కూడా తగ్గించలేదు. డీజిల్ ధరలో ప్రస్తుతం తెలంగాణ టాపే. చమురుపై వ్యాట్ తగ్గించని తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు  రవాణా శాఖ వాహనాలపై పన్నులు పెంచడంపై వాహనదారులు భగ్గుమంటున్నారు.పెంపు భారం నేరుగా ప్రయాణికులపైనే పడుతుందని ప్రైవేటు ట్రావెల్స్ యజమాన్యాలు అంటున్నాయి. కేసీఆర్ సర్కార్ తీరుపై ప్రజలు, వినియోగదారులు ఫైరవుతున్నారు.

READ ALSO: Osmania University: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఓయూ.. ఆరుగురు అరెస్ట్

READ ALSO: Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మంది అరెస్ట్.. ఇంటర్నెట్‌ సేవలపై మరో వారం బ్యాన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News