పోలవరానికి రూ.24 వేల కోట్లు..!
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంపై కేంద్రం కనికరం చూపింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన 979.36 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజక కింద 2017-18 ఆర్ధిక సంవత్సరానికి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు పేర్కొంది. మంజూరు చేసిన నిధులు జాతీయ జల అభివృద్ధి సంస్థ ఖాతా ద్వారా పోలవరానికి ప్రాజెక్టు అధారిటీకి చేరుతాయి. అలాగే 2019 నాటికి రూ. 24 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 3.5 వేల కోట్లు..వచ్చే రెండేళ్లలో ఏడాదికి 9 వేల కోట్లు చొప్పున కేటాయించాలని ప్రణాళికను సిద్ధం చేసింది. వచ్చే ఎన్నికల్లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది పూర్తియితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సశ్యస్యామలంగా మారుతుంది.