Chandrababu Polavaram Tour: దశాబ్దాల కల.. ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కావడానికిఇ మరో నాలుగేళ్లు పూర్తవుతుందని ప్రకటించారు. తాను ప్రాజెక్టు పూర్తి కోసం చేసిన కష్టాన్నంతా జగన్‌ బూడిదలో పోశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడీ పోలవరం ప్రాజెక్ట్ చూస్తుంటే బాధ, ఆవేదనగా ఉందని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Palla Srinivasrao Yadav: పల్లా శ్రీనివాస్‌కే వరించిన తెలుగు దేశం అధ్యక్ష పీఠం.. ఆయన రాజకీయ చరిత్ర తెలుసా?


 


ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో ప్రాజెక్టుపైకి చేరుకుని పరిశీలించారు. ప్రాజెక్టు ఏ దశలో ఉంది? ఎంత పూర్తయ్యింది వంటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Rushikonda Palace: రుషికొండ భవనం జగన్‌ సొంతానిది కాదు.. టీడీపీ తెలుసుకో: వైసీపీ ఘాటు కౌంటర్‌


 


'తెలంగాణ విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం చేశారు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే ఎప్పటికీ కరువు అనేది లేకుండా ఉండేది. 2014లో   తెలంగాణ పొత్తులో   భాగంగా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయించా' అని చంద్రబాబు గుర్తు చేశారు. 2005లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభించిననప్పటి నుంచి అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రాజెక్ట్ పూర్తయితే ఇప్పటికే  కృష్ణ, గుంటూరుతో పాటు  రాయలసీమకి  కూడా నీళ్లు  అందేవని పేర్కొన్నారు.


'తెలంగాణ నుంచి 7 విలీన మండలాలు ఏపీకి వచ్చాయి కాబట్టే ప్రాజెక్ట్‌ కట్టగలిగాం. పోలవరం ప్రాజెక్ట్‌ అనేక సంక్షోభాలను ఎదర్కొంది. పోలవరం ప్రాజెక్ట్‌తో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గోదావరి జిల్లాలకు నీరు వాడుకోవచ్చు. చైనా త్రీగార్జెస్‌ ప్రాజెక్ట్‌ కంటే ఎక్కువ నీరు ఈ ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే నుంచి విడుదల అవుతుంది. నదిని మళ్లించి కడుతున్న ప్రాజెక్ట్‌ ఇది' అని వివరించారు. అయితే తన హయాంలో 72 శాతం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే జగన్‌ నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు అని అసహనం వ్యక్తం చేశారు.


'2019-2020లో వరదలు వచ్చాయి. ఆ వరదలకు డాయాఫామ్ వాల్ 35 శాతం కొట్టుకుపోయింది. అయినా జరిగిన నష్టం కనుక్కోడానికి ఏడాది పట్టింది. ఇసుక బయట నుంచి తీసుకువచ్చి కంపెక్ట్ చేస్తున్నారు. దానికి ఖర్చు అవుతుంది అనేది తెలియదు. 2019లోనే పనులు కొనసాగితే 2020 వరకు ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఇప్పుడు ఇంకోసారి 4 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. అది కూడా అన్ని పరిస్థితులు అనుకూలిస్తే మాత్రమే' అని చంద్రబాబు తెలిపారు.


'ప్రాజెక్టుని ఎంత పూర్తి చేయాలో అంత సమస్యాత్మకంగా చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనుకున్న. నేను 30 సార్లు ప్రాజెక్ట్‌ చూసేందుకు వచ్చాను. నా మనసంతా ఈ ప్రాజెక్ట్‌ పైనే ఉంటుంది. పని చేసే కాంట్రాక్టులకు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. అది కూడా ఈ పని అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజల భవిషత్తు కు సంబంధించినది. ప్రాజెక్ట్ చూస్తే బాధ కలుగుతోంది' అని చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter