Rushikonda Palace: ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనంపై అధికార తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారంతోపాటు తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. రుషికొండపై నిర్మించిన భవనం ప్రభుత్వ అవసరాలకు అని, వ్యక్తిగతానికి కాదని హితవు పలికింది. దీంతో ఏపీలో రుషికొండ భవనంపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి.
Also Read: Rushikonda Palace: కళ్లు చెదిరేలా రుషికొండ ప్యాలెస్ లోపలి అందాలు.. ఒక్క బాత్ టబ్ ధర రూ.28 లక్షలు
మూడు రాజధానుల పేరిట విశాఖపట్టణంలో మకాం మార్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ భవనం నిర్మించారు. రుషికొండపై నిర్మించిన భవనం ముఖ్యమంత్రి పరిపాలన కార్యాలయంగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా వైఎస్ జగన్ అధికారం కోల్పోవడంతో ఆ భవనం నిర్వీర్యంగా మారింది. తాజాగా ఆ భవనాన్ని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు పరిశీలించారు. భవనం పరిశీలించిన అనంతరం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తన భార్య వైఎస్ భారతికి బీచ్ వ్యూ పాయింట్ భవనంగా జగన్ ఇవ్వాలనుకున్నారని విమర్శించారు. అంతేకాకుండా టీడీపీ అధికారిక హ్యాండిల్‌లో కూడా ఈ భవనానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు పెట్టి విమర్శలు చేశారు.
Also Read: Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణం
అధికార పార్టీ విమర్శలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. సామాజిక మాధ్యమాల ద్వారా టీడీపీకి ఘాటు కౌంటర్ ఇచ్చింది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని స్పష్టంగా తెలిపింది. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి అని పేర్కొంది. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని.. జగన్ సొంత అవసరాలకు నిర్మించినవి కాదని తేల్చి చెప్పింది. టీడీపీ బురదజల్లాలని ప్రయత్నిస్తోందని ఆక్షేపించింది. విశాఖపై చంద్రబాబు వైఖరిని గుర్తు చేస్తూ గతాన్ని తవ్వి తీసింది. ఈ మేరకు 'ఎక్స్'లో వైఎస్సార్‌సీపీ పోస్టు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది.
ఘాట్ కౌంటర్
'రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!' అని వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది. ఈ భవనం విషయమై ఆ రెండు పార్టీల మధ్య వివాదం నడుస్తోంది.
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి… https://t.co/o3m2GSOrAk
— YSR Congress Party (@YSRCParty) June 16, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter