అవి వజ్రాలు కాదు.. చొక్కా బొత్తాలు..!
హైదరాబాద్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన ఓ మోసాన్ని చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
హైదరాబాద్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన ఓ మోసాన్ని చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. విదేశాల నుండి తెప్పించిన ఖరీదైన చొక్కా బొత్తాలను (షర్ట్ బటన్స్) ఇంపోర్టెడ్ డైమండ్స్‌గా మభ్యపెట్టి చాలామందిని మోసం చేసింది ఓ ముఠా. అచ్చం డైమండ్స్‌లాగే కనిపించే ఈ చొక్కా బొత్తాలను అరబ్ దేశాలతో పాటు కొన్ని పర్షియన్ దేశాలలో కూడా వాడతారు. అచ్చం వజ్రాల్లాగే ఉండే ఈ బొత్తాలను ఒక ప్రత్యేకమైన మెటీరియల్‌తో తయారుచేస్తారు. అటువంటి చొక్కా బొత్తాలను వజ్రాలు అని నమ్మించి.. చాలామందికి ఆ ముఠా వజ్రాల వ్యాపారులమని పరిచయం చేసుకొని అమ్మగా.. ఆఖరికి ఆ నిజం ఎలాగోలా బయటకి వచ్చింది. తాము దారుణమైన మోసానికి గురై ఆ డమ్మీ డైమండ్స్ కోసం లక్షలు గుమ్మరించామని భావించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ప్లానింగ్ ప్రకారం ఆ దొంగల ముఠాను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ ముఠా బాగా డబ్బున్న మహిళలను టార్గెట్ చేయడం గమనార్హం.