Navaratri 2024: నవరాత్రుల్లో కన్యా పూజ ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

Shardiya Navratri Kanya Puja 2024: శారదీయ నవరాత్రులు అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభమైంది. ఈ రోజుల్లో దుర్గా మాతను 9 రూపాల్లో పూజిస్తారు. ఆశ్వీయుజ మాసంలో నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవమితో ఈ పూజలు పూర్తవుతాయి. అయితే, నవమి రాత్రుల్లో అష్టమి, నవమికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈరోజుల్లో కన్యా పూజ నిర్వహిస్తారు.
 

1 /5

హిందూ పురాణాల ప్రకారం కన్యా పూజ లేనిదే నవరాత్రి పూజ పూర్తికాదు. ఈ రోజు ఇంటికి బాలికలను పిలిచి వారిని అలంకరించి ప్రసాదాన్ని కూడా తినిపిస్తారు. వారి నుంచి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. ఈ పూజకు తొమ్మిది మంది బాలికలను ఇంటికి పిలుస్తారు. వీరు నవదుర్గాలుగా భావించి పూజలు చేస్తారు. ఇలా పూజించడం వల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. దీంతో ఇంట్లో దరిద్రం కూడా తొలగిపోతుంది.  

2 /5

ముఖ్యంగా నవరాత్రి పూజలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఇందులో కన్యా పూజ అత్యంత ప్రాముఖ్య కలిగి ఉంది. అంతేకాదు కన్యా పూజ చేయడం వల్ల ఇంట్లో సుకఃశాంతులు వెల్లువిరుస్తాయి. అందుకే ప్రత్యేకంగా నవరాత్రుల్లో కన్యా పూజ చేస్తారు.  

3 /5

పూజా విధి.. నవరాత్రుల్లో అష్టమి లేదా నవమిరోజు ఇంటికి 9 మంది బాలికలను పిలిచి వారిని అమ్మవారి ప్రతిరూపాలుగా పూజిస్తారు. వారికి ప్రసాదంగా హల్వా, ఖీర్‌ సమర్పిస్తారు. ముందు ఇంట్లోకి వచ్చాక వారి పాదాలను కడుగుతారరు. ఆ తర్వాత కాళ్లకు పసుపు పారాణీ కూడా పెడతారు. ప్రసాదం సమర్పించిన తర్వాత వారికి దక్షిణ కూడా ఇస్తారు, ఆశీర్వాదాలు తీసుకుని సాగనంపుతారు.

4 /5

దసరా నవరాత్రులలో ఏ వయస్సువారిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. రెండేళ్ల బాలిక -కుమారి, మూడేళ్ల బాలిక-  త్రిమూర్తి,  నాలుగేళ్ల బాలిక -కల్యాణి, ఐదేళ్ల బాలిక-రోహిణి,  ఆరేళ్ల బాలిక-కాళిక, ఏడేళ్ల బాలిక-చండిక, ఎనిమిదేళ్ల బాలిక -శాంభవి, తొమ్మిదేళ్ల బాలిక-దుర్గ, పదేళ్ల బాలిక- సుభద్రగా భావించి పూజలు చేస్తారు.  

5 /5

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)