Prakasam accident: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం..స్పాట్లోనే ముగ్గురు సజీవ దహనం..!
Prakasam accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైయ్యారు. కంభం నుంచి శ్రీశైలం వెళ్తున్న సమయంలో మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద ఒక్కసారిగా కారు టైరు పేలింది. దీంతో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది
Prakasam accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైయ్యారు. కంభం నుంచి శ్రీశైలం వెళ్తున్న సమయంలో మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద ఒక్కసారిగా కారు టైరు పేలింది. దీంతో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈక్రమంలో కారులో మంటలు చెలరేగాయి. కారులోకి వారంతా కాలి బూడిదైయ్యారు. కారు సైతం పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కారులోని మంటలను పోలీసులు, ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. కారు డ్రైవర్..చిత్తూరు జిల్లా భాకరాపేటకు చెందిన రావూరి తేజ(37)గా గుర్తించారు. మిగిలిన ఇద్దరు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Also read:Tamil Nadu: క్వారీ ఘటనపై స్టాలిన్ ప్రభుత్వం సీరియస్..బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన..!
Also read:Gyanvapi case: శివలింగం దొరికిన ప్రాంతాన్ని రక్షించండి, ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చన్న సుప్రీం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook