సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ రాజకీయాలపై ఆరంభం నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ, అనుభవంపై తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పూటకు ఓ మాట మారుస్తున్నారని, ఆయన ఓ ఊసరవెల్లి అని ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు. బీజేపీ పార్టీకి ఓటు వేయాలని తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు సూచించడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. ప్రతి ఎన్నికల్లో వేరే పార్టీలకు మద్దతు తెలిపే నేతవి అయితే రాజకీయాలు అవసరమా అని పవన్ కళ్యాణ్‌ను ఆయన ప్రశ్నించారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో నిరుత్సాహం చెందానని, ఆయన వ్యవహారం తనకు అర్థం కావడం లేదన్నారు. ఓ పార్టీ అధినేతగా ఉండి, వేరే పార్టీలకు మద్దతు తెలపడంపై పవన్ కళ్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మీ పార్టీ విధి విధానాలు ఏంటి, జనసేన పార్టీ ఓటింగ్ షేర్ ఎంత ఉందో తెలుసుకోవాలని పవన్‌కు సూచించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  బీజేపీకి తెలుపుతున్నాడని, ఆయన ఎన్నిసార్లు తన వైఖరి మార్చుకుంటారని.. ఊసరవెల్లిలా మారిపోయారని వ్యాఖ్యానించారు.



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు గతంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన బీజేపీకి, జనసేనకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. సొంతంగా రాజకీయాలు చేయాలి కానీ ఇతర పార్టీల వెంట నడవటం పవన్ కళ్యాణ్ తీరును తెలియజేస్తుందన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook