Prashanth Kishore - YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని చూస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని
ప్రజలు చిత్తుగా ఓడిస్తారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే తన అభిప్రాయాలను పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన  వెలిబుచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్దికి జగన్ చేసిందేమి లేదన్నారు. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధి విస్మరించారిన దుయ్యబట్టారు. ఇక పీకే గత 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ తరుపున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసారు. అంతేకాదు జగన్ అధికారంలోకి రావడానికి తన వంతు సాయం చేసారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నాటి..సీఎం భూపేశ్ బఘేల్ మాదిరిగా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే గెలుస్తామని భ్రమలో ఉన్నారు. ప్రజలకు కావాల్సిన ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నాయకుడు వారికి డబ్బులు ఇవ్వడమే కాకుండా.. వారి కోరికలను, ఆకాంక్షలను కూడా నెరవేర్చాలి. ఈ విషయంలో జగన్ కాస్త ఆలోచించుకుంటే బాగుండేది. మరోవైపు నేను రాజును.. మీకేం కావాలో నాకు తెలుసు.. డబ్బు లిస్తున్నాను కాబట్టి నాకు ఓటెండని అడుగుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పట్లో చక్రవర్తులు, రాజులు ఇదే తరహాలో బహుమతులు ఇవ్వడంపై దృష్టిపెట్టేరని ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ గుర్తు చేసారు. నగదు బదిలీ మాత్రమే కాదు. .ప్రజలకు అభివృద్ది ఫలాలు కూడా దక్కాలి. డబ్బు లిస్తున్నాము కాబట్టి రోడ్లు ఇతర మౌళిక సదుపాయాలు చేయకపోయినా.. ప్రజలు పెద్దగా పట్టించుకోరనే విషయాన్ని జగన్ విస్మరించారు. ఇక ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఎన్టీయే అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పారు. అంతేకాదు తెలంగాణలో బీజేపీ గతంలో కంటే గణనీయమైన సీట్లను సాధిస్తుందని చెప్పారు.


Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook