తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) ఆస్పత్రిలోని పద్మావతి కోవిడ్‌ సెంటర్‌లో ప్రమాదం జరిగింది. కొత్త భవనం పై పెచ్చులు ఊడిపడటంతో రాధిక అనే అటెండర్ (Pregnant woman dies) మృతి చెందింది. ఇదే ఘటనలో మరో ఇద్దరు ఉద్యోగులు సైతం గాయపడ్డారు. ఇటీవల ఈ భవనం నిర్మాణం పూర్తికావడంతో కోవిడ్‌19 కేర్ సెంటర్‌‌ (Padmavathi COVID care centre)ను అధికారులు ప్రారంభించారు. ప్రస్తుతం స్విమ్స్ ఆస్పత్రిలో 400 మంది కోవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాధిక కుటుంబంలో విషాదం
భవనం పై పెచ్చులు ఊడిపడిన ఘటనలో చనిపోయిన అటెండర్ రాధిక ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. కాగా, డెంగ్యూ రావడంతో ఏడాది కిందట రాధిక ఇద్దరు పిల్లలు మృతి చెందడం గమనార్హం. నాలుగు నెలల క్రితం స్విమ్స్‌లో ఉద్యోగంలో చేరిన రాధిక అంతలోనే ప్రమాదవశాత్తూ చనిపోవడం, అసలే గర్భిణి కావడంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం.



 


తమకు న్యాయం చేయాలంటూ కోవిడ్‌19 కేర్ సెంటర్‌ దగ్గర రాధిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్‌, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, రాధిక భర్త హరి కూడా కోవిడ్‌ సెంటర్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.