Special Darshan Tickets Of Tirumala February Quota: చిత్తూరు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.
Tirumala news: తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు మరోసారి ప్రారంభం కానున్నాయి. ధనుర్మాసం కారణంగా నిలిచిన ఈ సేవల్ని తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించారు.
KA Paul comments on Pawan Kalyan | తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించిన తర్వాత ఎమ్మెల్యేగా కానీ లేదా ఎంపీగా కానీ గెలవకుండానే ఏడు పార్టీలు మారారంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కడప జిల్లాలోని సిద్ధవటంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్నా నదిలో సరదాగా స్నానం చేయడానికి వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి వైకుంఠ ద్వార (vaikunta dwara darshanam) ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Tirumala Thieves | దొంగతనాలను నివారించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దొంగలు కొత్త కొత్త విధానాలతో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగల తెలివితేటలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుమలలో జరిగింది.
ఏపీలోని చిత్తురు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కోటా నేడు విడుదల కానుంది. నేటి ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను టీటీడీ (TTD) విడుదల చేయనుంది. ప్రతినెలా చివరి వారంలో ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల చేస్తారని తెలిసిందే.
తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) తిరుమలేశుడి భక్తులకు శుభవార్త తెలిపింది. అడుగడుగు దండాల వాడి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్త జనం కోసం రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ( Rs.300 TTD Special Darshan Ticket ) విడుదల చేసింది.
Sarva Darshan Tokens in Tirupati | పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పునఃప్రారంభించింది. నిన్న ప్రకటించినట్లుగానే భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా Tirumala శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు.
TTD to resume Sarva Darshan Tokens | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఇచ్చే సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు ముందుగానే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు.
తిరుపతి SVIMS ఆస్పత్రిలోని పద్మావతి కోవిడ్ సెంటర్‌లో ప్రమాదం జరిగింది. కొత్త భవనం పై పెచ్చులు ఊడిపడటంతో రాధిక అనే అటెండర్ (Pregnant woman dies) మృతి చెందింది. ఇదే ఘటనలో మరో ఇద్దరు ఉద్యోగులు సైతం గాయపడ్డారు.
తిరుమల దేవస్థానం డిక్లరేషన్ పై వివాదం రోజురోజుకూ పెరుగుతుంది. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనే దానిపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎక్కడా లేని డిక్లరేషన్ ఇక్కడెందుకని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ ( Andhra Pradesh ) లో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు.
TTD darshanam rules: తిరుమల: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ చేపట్టడంతో తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం ( Lord Balaji) కూడా నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా జూన్ 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాల్లో భక్తులకు ప్రవేశం కల్పిస్తూ కేంద్రం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలలో వెంకన్న భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
గతకొంతకాలంగా వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. అంతేగాక ఆ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్‌గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్‌వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
అలనాటి అందాల తార స్వర్గీయ శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్ తన స్నేహితురాలితో కలిసి సోమవారం వేకువజామున కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.