AP State Formation Day: తెలుగులో ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు. అది కూడా తెలుగులో ట్వీట్ చేయటం అందరిని ఆకర్షిస్తుంది. ఆదేవింధంగా సీఎం జగన్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Andra Pradesh State Formation Day: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భముగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపూతూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ "రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ తెలుగులో ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
పొట్టి శ్రీరాములు పోరాటంతో ఆంధ్ర ప్రదేశం రాష్ట్ర అవతరణ జరిగిన విషయం తెలిసిందే. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో ఇంతటి రాజకీయ నాయకులు కూడా ఆంధ్ర ప్రదేశం రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకంక్షాలు తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిచటానికి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది.
Also Read: RRR Movie Glimpse: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి గ్లింప్స్ వచ్చేసింది.. వీడియో ఎలా ఉందంటే?
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి "అమరజీవి పొట్టి శ్రీరాములుగారి లాంటి ఎంతోమంది మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం. వారు సాధించిన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ అందరి సహకారంతో అడుగులు ముందుకు వేస్తున్నా." అంటూ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook