Vizag gas leak tragedy : విశాఖలో విష వాయువు చిమ్మిన పరిశ్రమ ఎదుట మిన్నంటిన ఆందోళనలు
విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ ( Gas leak tragedy ) అయిన ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారి మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ (LG polymers chemical plant) ఎదుట ఆందోళనకు దిగారు.
వైజాగ్: విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ ( Gas leak tragedy ) అయిన ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారంతా ప్రస్తుతం విశాఖలోని కేజీహెచ్‌లో ( KGH in Vizag ) చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారి మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ (LG polymers chemical plant) ఎదుట ఆందోళనకు దిగారు. పరిశ్రమను మూసేయాలని లేదా ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
Also read : Vizianagaram : విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం
డీజీపీ పాదాలపై పడి వేడుకున్న మహిళ..
విచారణలో భాగంగా పరిశ్రమ వద్దకు వచ్చిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ( AP DGP Gowtham Sawang ), మంత్రి అవంతీ శ్రీనివాస్‌ని ( Minister Avanthi Srinivas ) ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన విరమించబోమని గ్రామస్తులు తెగేసి చెప్పారు. కొంతమంది నిరసనకారులు గేట్లు దూకి పరిశ్రమలోపలికి చొచ్చుకువెళ్లి తమ నిరసన తెలియజేశారు. డీజీపీ గౌతం సవాంగ్ కాళ్లపై పడిన ఓ మహిళ.. ఇంత మంది ప్రాణాలను బలి తీసుకున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకున్నారు.
Also read : Vizag gas leak tragedy : మరో ఇద్దరు మృతి, రూ. 30 కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల
డీజీపీ గౌతం సవాంగ్ హామీ.. పట్టించుకోని ఆందోళన కారులు..
ఆందోళనకారుల డిమాండ్లపై స్పందించిన ఏపీ డీజీపి గౌతం సవాంగ్.. కేంద్రం నుంచి నిపుణుల బృందం శాస్త్రీయ విచారణకు వస్తోందని, వారి సూచనల మేరకే చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ నిరసనకారులు ఆందోళన విరమించలేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..