Vizag gas leak tragedy : మరో ఇద్దరు మృతి, రూ. 30 కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల

Vizag gas leak tragedy విశాఖ గ్యాస్‌ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాతో పాటు అనారోగ్యం బారినపడి ఆస్పత్రిపాలైన వారికి అందించ నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ( AP govt ) శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

Last Updated : May 8, 2020, 08:46 PM IST
Vizag gas leak tragedy : మరో ఇద్దరు మృతి, రూ. 30 కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల

అమరావతి: Vizag gas leak tragedy విశాఖ గ్యాస్‌ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాతో పాటు అనారోగ్యం బారినపడి ఆస్పత్రిపాలైన వారికి అందించ నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ( AP govt ) శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.కోటి రూపాయలు ఎక్స్‌‌గ్రేషియా ( Ex gratia ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, ఆస్పత్రిలో రెండు, మూడు రోజుల చికిత్స అవసరమైన వారికి రూ.లక్ష, స్వల్ప అస్వస్థతకుగురై ప్రథమచికిత్స పొందిన వారికి రూ.25 వేలు నష్టపరిహారం అందించనున్నట్టు సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) గురువారమే స్పష్టంచేశారు. విశాఖలోని కేజీహెచ్‌లో మృతుల కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను  పరామర్శించిన సందర్భంగా సీఎం జగన్ ఈ ప్రకటన చేశారు. ఆ ప్రకటన ప్రకారమే వారికి సత్వర ఉపశమనం కోసం నేడు ఆ నిధులు విడుదల చేశారు. గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లోనూ ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు ఏపీ సర్కార్ వెల్లడించింది. 

Also read : TRS MLA చెన్నమనేని రమేష్ ‘పౌరసత్వం రద్దు’పై తీర్పు వాయిదా

ఇదిలావుంటే, ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజ్ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12 కు చేరింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News