పనుల కోసం కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతారు.. డబ్బు ఇచ్చినా ఆ పని ఎప్పుడవుతుందో తెలియదు.. నా బాధలు ఎప్పుడు తీరుతాయి.. డబ్బులు పోయాయి.. సమయం  కూడా వృధా అయిపోయింది..  ఇలా అనుకొనే వారుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

.. ఇలాంటి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం  మంగళవారం శాసన సభలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ చట్టం పేరు "ప్రజా సేవల హామీ చట్టం-2017". ఈ చట్టం రాష్ట్ర పౌరుల కోసమే అని మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆయన పౌరులకు సేవలందించడంలో.. ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీ తనం పెంపొందించేలా ఈ చట్టాన్ని రూపొందించామని చెప్పారు. 


పౌరులకు అండగా నిలిచే ఈ చట్టంలోని అంశాలు


* ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఒక నెంబర్ కేటాయిస్తారు. పరిష్కారానికి నిర్ణీత గడువు నిర్ణయిస్తారు.  


*  సకాలంలో ఆ సేవలను సంబంధిత శాఖ అందించాలి. ఆలస్యమైతే.. ఎందుకు ఆలస్యమవుతుందో ముందుగానే సదరు అధికారి దరఖాస్తుదారుడికి రాతపూర్వకంగా తెలియజేయాలి. 


* అలా కానిపక్షంలో దరఖాస్తుదారుడు కాలయాపనకు జరిమానా చెల్లించాలని కోరుతూ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. 


* ఆలస్యం అయినందుకు సంబంధిత అధికారి దరఖాస్తుదారుడికి జరిమానా చెల్లిస్తాడు.