Seshachalam Forest: అడవుల్లో దొరికే అత్యంత అరుదైన కలప ఎర్ర చందనం. పుష్ప సినిమాలో ఎర్ర చందనం దొంగతనం కొత్త తరహాలో చేయగా.. ఆ సినిమాను మించి దొంగలు విలువైన కలపను దొంగిలించిన సంఘటన వైరల్‌గా మారింది. శేషాచలం అడవుల్లో సరికొత్త తీరులో ఎర్ర చందనాన్ని దొంగతనం చేస్తూ కూలీలు కొందరు పట్టుబడ్డారు. వారి నుంచి భారీగా ఎర్ర చందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: Medico Suicide: నా చావుకు నేనే కారణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న మెడికో ఆత్మహత్య


 


అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం గడికోట శేషాచలం అడవుల్లో  ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీస్‌, అటవీ శాఖ, తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్ర చందనం చెట్లను నరికి దుంగలను  తరలిస్తున్న స్మగ్లర్లు కూలీల వాహనాన్ని పోలీసులు వెంబడించారు. సినిమా రేంజులో వెంబడించి దొంగలను పోలీసులు పట్టుకున్నారు.


ఇది చదవండి: New Bride: 'అందంగా లేదు.. లావుగా ఉంది' అని అవమానించడంతో ఆర్మీ జవాన్‌ భార్య ఆత్మహత్య


 


వీరబల్లి మండలం ఈడిగపల్లి వద్ద స్మగ్లర్లను వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూలీల దగ్గర నుంచి  రూ.17.42 లక్షల విలువైన 20 ఎర్రచందనం దుంగలు  స్వాధీనం చేసుకున్నారు. కారు స్వాధీనం చేసుకొని 12 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వారిలో తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన 11 మంది ఎర్రచందనం కూలీలు, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు భగత్ సింగ్ కాలనీకి చెందిన కారు డ్రైవర్‌ గాండ్ల లతీఫ్ భాష (25)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్  చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ కృష్ణ మోహన్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాయచోటి సబ్ డివిజన్ డీఎస్పీ కృష్ణ మోహన్ వివరాలు వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.