Revanth AP Tour: లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి విరామం లేకుండా విస్తృత ప్రచారం చేస్తున్నారు. సొంత రాష్ట్రం తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో రేవంత్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో ప్రచారం చేసిన రేవంత్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ పర్యటించనున్నాడు. ఇప్పటికే ఒకసారి ఏపీలోని విశాఖపట్టణంలో పర్యటించిన ఆయన ఇప్పుడు కడపలో ప్రచారం చేయనున్నాడు. అక్కడి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మద్దతుగా పర్యటించనున్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pothina Mahesh: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ పెళ్లాలు ప్రచారం చేయరా? ఛీ నా బతుకు చెడ


 


తెలంగాణ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల రాకతో కాంగ్రెస్‌కు జోష్‌ వచ్చింది. మళ్లీ పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది. 2014, 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఒక్క లోక్‌సభ, శాసనసభ కూడా గెలవలేకపోయింది. ఇక స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి నిరాశే ఎదురైంది.

Also Read: YS Sharmila: ప్రజల ముందు కొంగుచాచిన వైఎస్‌ షర్మిల.. న్యాయం చేయాలని డిమాండ్‌


విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ కళ వచ్చింది. వైఎస్ షర్మిల పార్టీలోకి ప్రవేశించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్‌కు ఒక జోష్‌ వచ్చింది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఇంకా రావాల్సినంత జోష్‌ రాకపోవడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించిన కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీ పుంజుకునేలా చర్యలు తీసుకుంటోంది. 


పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం ఏపీలో ఉంటుందని భావించి ఇక్కడ పార్టీ విస్తరణకు అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రేవంత్‌ రెడ్డి సేవలు తరచూ వినియోగించుకోవాలని భావించింది. అందులో భాగంగా ఇప్పటికే విశాఖపట్టణంలో ఒకసారి రేవంత్‌ రెడ్డి పర్యటించాడు. ఇప్పుడు తాజాగా షర్మిల పోటీ చేస్తున్న కడప లోక్‌సభ నియోజకవర్గంలో రేవంత్‌ పర్యటించనున్నాడు. అతడితోపాటు పార్టీ అగ్ర నాయకులు కూడా ఏపీలో అడుగుపెట్టనున్నారు.


ఈనెల 7వ తేదీన కడప జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రానున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్, తెలంగాణ నుంచి రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. కడప మునిసిపల్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో వారు పాల్గొననున్నారని సమాచారం. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఝలక్‌ ఇచ్చేలా షర్మిలను పోటీ దింపి ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ ఆసక్తికరంగా మార్చింది. కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో మళ్లీ పూర్వవైభవం కోసం.. షర్మిల గెలుపు కోసం కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేయనున్నారు. కడప బహిరంగ సభ రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి జోష్‌ తీసుకువచ్చే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter