Pothina Mahesh Letter: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పోతిన వెంకట మహేశ్ కొరకరాని కొయ్యగా మరాడు. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన ప్రస్తుతం జనసేనకు తలనొప్పిగా తయారయ్యాడు. జనసేనకు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన పోతిన మహేశ్ పవన్ కల్యాణ్‌ను వదలడం లేదు. ఈ సందర్భంగా పవన్‌కు సంచలన లేఖ రాశాడు. ఆ లేఖలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పవన్‌ను నేరుగా నిలదీశారు.
Also Read: Laxmi Parvathi: 7వ తరగతి పాసవ్వని చంద్రబాబు 2 లక్షల కోట్లు దోపిడీ: ఎన్టీఆర్ భార్య
అభిమానులతో మెగా కుటుంబం వ్యవహరించే తీరు.. మెగా కుటుంబం వ్యవహార శైలిపై ఆ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా పవన్ కాపులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు తప్ప వారికి ఏం చేయడం లేదని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రశ్నించారు. పోతిన మహేశ్ ప్రశ్నలు ఇవే..
Also Read: YS Sharmila: ప్రజల ముందు కొంగుచాచిన వైఎస్ షర్మిల.. న్యాయం చేయాలని డిమాండ్
- మెగా కుటుంబానికి అభిమానులు దగ్గర నుంచి అన్ని తీసుకోవడమే గాని ఇవ్వడం తెలియదు. మెగా కుటుంబంలో జరిగిన ఏ ఒక్క శుభకార్యానికి అయినా అభిమానులకు ఏనాడైనా ఒక విస్తరాకులో ప్లేటు భోజనమైనా పెట్టారా? శుభకార్యాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పెట్టి వ్యాపారం కూడా చేసుకుంటారు. కానీ పిఠాపురానికి మాత్రం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. మీరు ప్రజలకు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి ఎప్పుడూ ఏమి చేయరు. వాళ్లను అడ్డం పెట్టుకొని అన్ని సంపాదించుకుంటారు.
- పవన్ కల్యాణ్ గారు మీరు ఐదేళ్లుగా మీరు వినియోగిస్తున్న ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ఖర్చుల గురించి ఎన్నికల అఫిడివిట్‌లో ఎందుకు చూపలేదు? ఇవి మీ సొంతమా? లేక మీ బినామీల ద్వారా కొనిపించి వాడుతున్నారా? అద్దెకు తీసుకొని చెల్లింపులు చేస్తున్నట్లు డ్రామాలు చేస్తున్నారా? విమాన రంగంలో కూడా పవన్ కల్యాణ్ గారికి వాటాలు ఉన్నాయా? ఒక బినామీ కంపెనీ ద్వారా తమరు కొనుగోలు చేసి అందులో డైరెక్టర్‌గా వినయ్, విశ్వప్రసాదులను నియామకం చేశారా? సామాన్య మధ్య తరగతికి (ఈమధ్య ఉపన్యాసాల్లో చెబుతున్నారు) చెందిన మీరు ప్రత్యేక విమానాల్లో నిరంతరం ప్రయాణించేంత లగ్జరీ జీవితానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- కాపు సామాజిక వర్గం వారికి చెందిన Prime 9 ఛానల్ రఘువీర్ గారికి తమరు ఎందుకు విలువనివ్వరు. 99 tv ఛానల్ తోట సత్యనారాయణ, NO- 1 ఛానల్ సుధాకర్ నాయుడుకు ఏనాడైనా మీరు సరైన రీతిలో మద్దతు ఇచ్చారా? కాపు సామాజిక వర్గం ప్రారంభించిన ఈ చానల్స్‌కు మీరు ఎందుకు అండగా నిలవలేదు. మీకు కొన్ని వేరే చానల్స్‌పై మహాప్రేమ ఎందుకో. కాపు సామాజిక వర్గం వారు ఏర్పాటుచేసిన చానల్స్‌ను మీరు ఎందుకు ఎదగనివ్వరు?
- దాతలు, ఎన్నారైలు ఇంకా చాలామంది జనసేన పార్టీకి విరాళాలు ఇచ్చారు. వాటి గురించి పవన్ కల్యాణ్ ఎప్పుడు సరిగ్గా మాట్లాడలేదు. కానీ మీ అన్న చిరంజీవి దగ్గర తీసుకున్న చెక్కుని గదిలో తీసుకోవచ్చు కదా ఎందుకు ప్రచారం చేశారు?
- మీరు ప్రతి 10- 15 రోజులకు ఫోన్ నంబర్లు ఎందుకు మారుస్తారు? దానికి కారణం ఏంటి? మీ దగ్గర ఏ నంబర్ ఒకటి స్థిరంగా ఉండదంట కదా? కారణాలేంటి? గతం తమరిని వెంటాడుతుందనా? లేక అభద్రతా భావమా?
- ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో వైఎస్ భారతి, కుప్పంలో భువనేశ్వరి, మంగళగిరిలో బ్రాహ్మణి, మరి పిఠాపురంలో..?
యూ టూ..ఛీ నా బతుకు చెడ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter