AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Rain Alert For AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Rain Alert For AP: నైరుతి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కొనసాగుతోంది. శ్రీలంకకు తూర్పున 600 కి.మీ.,కారైకాల్‌కు 630 కి.మీ.,చెన్నైకి 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ డా బీఆర్ అంబేద్కర్ తెలిపారు. రాగల 48 గంటల్లో నెమ్మదిగా తమిళనాడు-దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముందస్తు చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లరాద సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
కాగా.. ఏపీలో చలి తీవ్రత పెరగడంతో ఉష్ణ్రోగతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. అరకు, పాడేరు, లంబసింగి ప్రాంతాలు నిత్యం మంచుతో కప్పేస్తున్నాయి. మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు. ఆదివారం ప్రకృతి సోయగాలకు వీక్షించేందుకు ఎగబడుతున్నారు.
తెలంగాణతో పాటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు చెబుతున్నారు. రాబోయే రెండు రోజులపాటు వర్షాలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బంది పడగా.. తాజాగా మరోసారి భారీ వర్ష సూచనతో ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కాస్తా గ్యాప్ ఇచ్చిన వరుణ దేవుడు.. మళ్లీ ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
Also Read: Auto Rickshaw Blast: కదులుతున్న ఆటోలో మంటలు.. వెలుగులోకి షాకింగ్ విషయం
Also Read:IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. సంజూకి తప్పని నిరాశ! ఓపెనర్లుగా పంత్, ఇషాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook