రెయిన్ అలర్ట్: 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం
రెయిన్ అలర్ట్
ఓవైపు వరి పంట కోతకు వస్తోంటే, మరోవైపు కోస్తాంధ్రను వర్ష సూచన వెంటాడుతోంది. సోమవారంలోగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రలో రానున్న రెండు, మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఈ మూడు రోజులపాటు సముద్రంలోనూ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని జాలర్లను అప్రమత్తం చేసిన అధికారులు.. జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
ఇదిలావుంటే, మరోవైపు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కోస్తాంధ్ర ప్రాంతాల్లోని జిల్లాల అధికార యంత్రాంగం సైతం అప్రమత్తమైంది.