Rain Alert to AP: హైఅలర్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..!
IMD Predicts Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
IMD Predicts Heavy Rains in AP: ఐఎండీ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం (అక్టోబర్ 14) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని చెప్పారు. సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
Also Read: Chandrababu: పండుగ రోజు కూడా పాలనలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఉల్లి, టమాట ధరపై శుభవార్త
ప్రజలు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని అలాగే భారీ వర్షం పడేప్పుడు బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండకూడదని సురక్షిత భవనాల్లో ఉండాలని కోరారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 64మి.మీ, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో 54.7 మి.మీ, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 47.7 మి.మీ, ఏలూరు జిల్లా చాట్రాయిలో 39.5 మి.మీ, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 38.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైందని చెప్పారు.
రానున్న నాలుగు రోజులు వాతావరణం ఇలా ఉండే అవకాశం..
==> 13 అక్టోబర్, ఆదివారం: అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ , అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
==> 14 అక్టోబర్, సోమవారం: అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురంమన్యం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది
==> 15 అక్టోబర్, మంగళవారం: కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
==> 16 అక్టోబర్, బుధవారం: కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: Festive Fashion: దసరా నాడు హీరోయిన్ల ట్రెడిషనల్ లుక్స్.. పండుగకు మరింత అందం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.