Chandrababu: పండుగ రోజు కూడా పాలనలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఉల్లి, టమాట ధరపై శుభవార్త

Chandrababu Naidu Good News To AP People: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉంటున్నారు. దసరా పండుగ నాడు కూడా పరిపాలనలో నిమగ్నమయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 12, 2024, 05:02 PM IST
Chandrababu: పండుగ రోజు కూడా పాలనలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ఉల్లి, టమాట ధరపై శుభవార్త

Onion Tomato Price Hike: దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగలతో ప్రజలంతా ఉత్సాహ వాతావరణంలో ఉండగా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం పరిపాలనలో తలమునకలై ఉన్నారు. పండుగ రోజు కూడా పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటూ బిజీబిజీగా గడిపారు. దసరా పండుగ సందర్భంగా ప్రజలకు తీపి కబురు వినిపించారు. కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా పలు శాఖలపై శనివారం సమీక్ష నిర్వహించారు.

Also Read: Dusshera: ఇంద్రకీలాద్రిపై తీవ్ర ఆంక్షలు.. భక్తులు తీవ్ర ఇబ్బందులు

 

ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షిచారు. సంబంధిత మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు.. ఆయా శాఖల అధికారులతో అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా పౌరసరఫరా శాఖ తీసుకుంటున్న చర్యలను ఆరా తీశారు.

Also Read: Taps Stolen: సర్కార్‌ నల్లాలు కూడా వదిలిపెట్టలేదు.. 9 లక్షల విలువైన ఇత్తడి నల్లాలు చోరీ

 

మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. డిమాండ్-సప్లయ్‌ మధ్య వ్యత్యాసానికి కారణాలను తెలుసుకుని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధరలు పెరగకముందే నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలను ముందుగానే గ్రహించి అరికట్టవచ్చని తెలిపారు. ధరల నియంత్రణపై పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయని వివరించారు.

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు తాత్కాలికంగా.. దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించి సూచనలు చేశారు. ప్రస్తుతం రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన అమ్మకాలపై సమీక్షలో వివరించారు. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమోటా, ఉల్లిపాయలు రైతు బజార్‌లలో కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కంటే రూ.10 నుంచి రూ.15 తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. 

విజిలెన్స్ శాఖ క్రియాశీలకంగా పనిచేయాలని, వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పామాయిల్, కూరగాయలు, పప్పు ఉత్పత్తులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలన్నారు. ధరల నియంత్రణ విషయంలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉండాలని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News