weather alert in Telugu States: ఏపీలో రాగల మూడు రోజుల్లో వర్షాలు (Rains in AP) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఉత్తర కోస్తాంధ్ర, యానాంల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. ఎల్లుండి తేలికపాటి  వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయలసీమలో ఈరోజు,రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని  చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు ౩౦నుండి 40 కి మీ వేగంతో ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మరియు ఎల్లుండి  తేలికపాటి  వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. 


తెలంగాణలో...
తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఉపరితల ద్రోణి  మధ్య ఛత్తీస్ ఘడ్ నుండి తెలంగాణ, ఉత్తర కర్ణాటక  మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో గంటకు 30 నుండి40 కి మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయి. ఇవీ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలుఉన్నాయి. 


Also Read: AP Summer Holidays: ఏపీలో వేసవి సెలవులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుంచంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook