Rajadhani Files:`రాజధాని ఫైల్స్` సినిమాపై ఏపీ హైకోర్టు షాక్.. విడుదల పై స్టే..
Rajadhani Files: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు సినిమాలను అస్త్రాలుగా వాడుతున్నాయి. ఈ కోవలో అధికార పార్టీకి బూస్ట్ ఇచ్చేలా యాత్ర 2 విడుదలైంది. మరోవైపు ఏపీలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా `రాజధాని ఫైల్స్` సినిమా వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదలైన ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది.
Rajadhani Files: మరో నెలన్నర రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడింది. ఈ సందర్భంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైయస్ఆర్సీపీ, తెలుగు దేశం పార్టీలు తమదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ కోవలో సినిమాలను వెపన్స్‌గా వాడుకుంటున్నారు. ఇప్పటికే వైయస్‌ఆర్సీపీ అధినేత వైయస్ జగన్‌కు అనుకూలంగా 'యాత్ర 2' మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వర్కౌట్ కాలేదు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. అందుకోసం సినిమాలను వాడుకుంటున్నారు. ఈ కోవలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల అడ్డుకోవడానికి అవసరమైన అన్ని మార్గాల్లో ప్రయత్నించి ఒకింత సక్సెస్ అయ్యారు. చివరకు ఈ సినిమా విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.
అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి టీడీపీ వాళ్లే 'రాజధాని ఫైల్స్' అంటూ ఓ సినిమాను తెరకెక్కించారనే ఆరోపణలు వచ్చాయి. ఒక్కడి అహం వేల మంది రైతుల కన్నీరు.. కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంటూ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ అమరావతి రైతులను పట్టించుకోవడం లేదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాను ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కానీ ఈ సినిమా విడుదలై స్టే విధించింది. రేపటి వరకు ఈ సినిమా రిలీజ్‌ను నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సెన్సార్ సర్టిఫికేట్ సమర్పించాలని ఆదేశించింది. సెన్సార్ బోర్ట్ చెప్పిన విధంగా 13 సీన్స్ తొలిగించినట్టు ఏపీ హైకోర్టుకు తెలిపిన నిర్మాతలు. అన్ని రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. మొత్తంగా ఏపీలో పొలిటికల్ చిత్రాలు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి.
ఇదీ చదవండి: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 7 ఫోటోస్ మీకోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook