Wildlife Photographer of the Year: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇటీవల ప్రకటించారు. ఒక స్వీట్ ఫోటో దానిని గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ఒక్క ఫోటో ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైంది. అదేంటో మీరూ చూసేయండి.
మంచుపై నిద్రపోతున్న ఎలుగుబంటి.. హిమానీనదంపై ప్రశాంతంగా నిద్రిస్తున్న ధృవపు ఎలుగుబంటి ఫోటోను బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ నిమా సరిఖానీ పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేకమైన ఛాయాచిత్రం వల్ల ఆయన పీపుల్స్ ఛాయిస్ అవార్డు నుండి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కారం పొందారు.
తాబేలు.. Tzahi Finkelstein ఒడ్డున ఉన్న పక్షులను గమనిస్తూ ఉండగా అతను ఒక తాబేలును చూశాడు. అకస్మాత్తుగా తాబేలు ముక్కుపై ఒక బగ్ వాలింది. ఆ ఫోటో ఇది.
పక్షులు.. ఇటలీలోని రోమ్‌లో డేనియల్ డెన్సెస్కు ఈ అద్భుతమైన ఫోటో తీయడానికి చాలా గంటలు గడిపారు. ఇక్కడ అనేక పక్షులు ఒకే పక్షి ఆకారాన్ని సృష్టించినట్లుగా ఉంది.
అడవిరాజు కుటుంబం.. మార్క్ బోయిడ్ వ్యాఖ్యానించిన ఈ ఫోటోలో అడవి రాజు కుటుంబం ఉంది. ఈ ఫోటో మీకు ఎలా అనిపిస్తుంది?
జెల్లీ ఫిష్.. నార్వేజియన్ జలాల్లో జెల్లీ ఫిష్ ఈత కొట్టడం వల్ల నీటిపై ఏర్పడిన ఆకారాలు.
ఇది ఏ చేప? కరీం లియా పోస్ట్ చేసిన ఈ సముద్రపు అంతరాల ఫోటో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. నీటిలో ఉన్న ఈ చేపను గుర్తించగలరా?
పెంగ్విన్.. మంచు కురిసే ప్రాంతంలో ముచ్చటిస్తున్న పెంగ్విన్లు. ఈ ఫోటో స్టీఫెన్ క్రిస్ట్‌మన్ క్లిక్ చేసిన ఫోటో ఇది.