చంద్రబాబు పాక్ ప్రధానిని అనుసరిస్తున్నారు - అమిత్ షా సంచలన ఆరోపణలు
రాజమండ్రి: కాంగ్రెస్ పార్టీ, టీడీపీలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన .. కశ్మీర్ పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఉద్వేభరితరంగా ప్రసంగించారు. కాశ్మీర్ ను సాకుగా చూపి పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని.. ఈ సమస్యకు కారణం ఎవరు అని చెప్పాల్సి వస్తే అది నెహ్రూ తప్ప మరొకరు కాదని ఉద్ఘాటించారు అమిత్ షా. పటేల్ ప్రధాని అయ్యుంటే అసలు కశ్మీర్ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు.
ఉగ్రదాడితో కాంగ్రెస్ రాజకీయాలు
పూల్వామా దాడిని ప్రస్తావిస్తూ యావత్ దేశం అమర జవాన్లకు నివాళి అర్పిస్తుంటే ...కాంగ్రెస్ మాత్రం రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని దయ్యబట్టారు పుల్వామా దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఫిల్మ్ షూటింగ్ లో బిజీ అయ్యారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఈ కోవలోకే వస్తాయని అన్నారు. సరిగ్గా పుల్వామా ఘటన జరిగిన సమయంలో ప్రధాని ఓ ఈవెంట్ లో ఉన్నారని..దాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు.
బాబు తీరు బాధాకరం...
పూల్వామా దాడిని ప్రస్తావిస్తూ చంద్రబాబును కూడా అమిత్ షా... టార్గెట్ చేశారు. కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని దేశ ప్రజలందరూ ఖండిస్తుంటూ ఉంటే.. చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ప్రధాని మోడీని విమర్శిస్తూ కూర్చున్నారని ఆరోపించారు. ఆయన స్పందించిన తీరు చూస్తుంటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఫాలో అవుతన్నట్లుగా ఉందని అమిత్ షా విమర్శించారు. పూల్వామా దాడిని దాడిపై స్పందింస్తూ ఈ ఘటనకు ప్రధాని మోడీ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైపీపీ విమర్శల దాడి చేస్తున్న విషయం తెలిసిందే..ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా విమర్శలకు దిగడం గమనార్హం.