Ram Gopal Varma: డేరింగ్ డైరెక్టర్‌కు థర్డ్ డిగ్రీ భయం.. హైకోర్టులో వర్మ మరో పిటిషన్.. రచ్చగా మారిన ఏపీ రాజకీయాలు..
Ram Gopal varma petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారంట.
ram gopal varma filed bail petition in ap high court: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం పోలీసులు సోషల్ మీడియాలో పోస్టులు, ట్రోలింగ్ లకు పాల్పడిన వారి తాట తీస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు,లోకేష్, పవన్ కళ్యాణ్, మహిళ నేతల్ని ఉద్దేశించి పోస్టులు పెట్టిన వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో వ్యూహాం సినిమా సమయంలో ఆర్జీవీ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాన్, లోకేష్ సతీమణిపై వివాదస్పదంగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఒంగోలులోని మద్దిపాడు పీఎస్ లో కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణకు రావాలని ఆర్జీవీ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నిన్న (నవంబర్ 19) విచారణకు రాలేనని, వారం రోజులు సమయం కావాలని ఆర్జీవీ పోలీసులకు రిక్వెస్ట్ లెటర్ సైతం పంపించారు. ఇదిలా ఉండగా.. ఆర్జీవీ ఏపీ హైకొర్టులో తాజాగా.. మరో పిటిషన్ ను దాఖలు చేశారంట. తనపై ఏపీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారంట. తనకు ముందస్తు బెయిల్ దాఖలు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారంట.
ఇదిలా ఉండగా.. ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. మరోవైపు.. ఐటీ చట్టం ప్రకారం ఆర్జీవీపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యుల్ని వ్యక్తిత్వ హననం కలిగే విధంగా వర్మ పోస్టులు, వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Read more: Viral Video: అమ్మాయికి మెస్సెజ్ చేశాడని దారుణం.. యువకుల పాశావిక దాడి.. వీడియో వైరల్..
టీడీపీకి చెందిన రామలింగం ఫిర్యాదు మేరకు నవంబర్ 12, 2024వ తేదీన ఈ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పోలీసులు పోసాని, శ్రీరెడ్డిలు సైతం వివాదస్పదంగా మాట్లాడినందుకు, పోస్టులు పెట్టినందుకు వారిపై కేసుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.