Chalo Vijayawada: ఆ జనసందోహాన్ని చూసి రాంగోపాల్ వర్మకు చలి జ్వరం...
Ram Gopal Varma reacts on Chalo Vijayawada: ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతమవడంపై రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. ఏపీ ఉద్యోగులకు ఆయనో సలహా కూడా ఇచ్చారు.
Ram Gopal Varma reacts on Chalo Vijayawada: ఏపీలో పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ అంచనాలకు మించి సక్సెస్ అయింది. పోలీసుల నిర్బంధాలను చేధించుకుని ఉద్యోగులు లక్షలాదిగా విజయవాడకు తరలివచ్చారు. పోటెత్తిన ఉద్యోగులతో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు జనసంద్రాన్ని తలపించింది. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. భారీగా తరలివస్తున్న ఉద్యోగులను అడ్డుకోలేక పోలీసులే నిశ్చేష్టులైపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'ఛలో విజయవాడ'పై ట్విట్టర్‌లో తనదైన శైలిలో స్పందించారు.
'ఏపీ సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జనసందోహాన్నీ చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది.' అని రాంగోపాల్ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో.. 'లక్షలాది మంది ఉద్యోగులు ఇలా రోడ్ల పైకి వచ్చి తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం నాకు షాకింగ్‌గా ఉంది. నాకో సందేహం... ప్రపంచంలో ఇంతకుముందెప్పుడైనా ఇలా జరిగిందా...?' అని పేర్కొన్నారు.
అంతేకాదు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాంగోపాల్ వర్మ ఒక సలహా కూడా ఇచ్చారు. సందర్భం డిమాండ్ చేసినప్పుడు మౌనంగా ఉండిపోవడం పిరికితనం అవుతుందని సూచించారు. వర్మ ట్వీట్స్‌పై కొంతమంది సానుకూలంగా స్పందిస్తుంటే.. మరికొందరు ఆయనపై మండిపడుతున్నారు. ఇది టీడీపీ ప్రోద్బలంతో జరిగిన నిరసన (Chalo Vijayawada) అని కొంతమంది నెటిజన్లు ఆరోపించగా.. అనవసరంగా జగన్‌ను టార్గెట్ చేయొద్దంటూ మరికొందరు వర్మను హెచ్చరించారు. గతంలో తమిళనాడులో జయలలిత హయాంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఒకేసారి తొలగించిన విషయాన్ని మరికొందరు గుర్తుచేస్తున్నారు.
Also Read: Horoscope Today: నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook