Ramatheertham Temple: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రామతీర్ధం కోదండ రామాలయం రూపు దిద్దుకుంటోంది. ఆలయాన్ని పూర్తి స్థాయిలో తీర్దిదిద్ది..2022 జనవరి నాటికి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో మొన్నటివరకూ ఓ వ్యూహం ప్రకారం ఆలయాలపై దాడులు(Attacks on Temples) జరిగాయి. ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరించి నియంత్రించింది. ముఖ్యంగా విజయనగరం జిల్లా రామతీర్ధంలోని బోడికొండపై ఉన్న కోదండ రామాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం(Ap government) గట్టి చర్చలు చేపట్టింది. రామాలయాన్ని తిరిగి నిర్మించేందుకు 3 కోట్లు కేటాయించింది. ఇప్పడికే టెండర్లు పూర్తయ్యాయి. కొండపై ఉన్న ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్తి..అనుకున్న సమయానికి ఆలయాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. కోదండ రామాలయాన్ని 2022 జనవరి నాటికి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.


ఆగమశాస్త్రం ప్రకారమే పండితులు, స్వామీజీల సూచనల ప్రకారం రామతీర్ధం ఆలయాన్ని(Ramatheertham Temple) నిర్మిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచి నిపుణుల్ని రప్పించి రాతి కట్టడంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. దేవాలయాల పరిరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచన మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Vellampalli Srinivas). ఇప్పటికే 65 శాతం ఆలయాల్లో సీసీ కెమేరాల ఏర్పాటు పూర్తయిందన్నారు. చంద్రబాబు నాడు గుడులు కూల్చితే..నేడు వైఎస్ జగన్ (Ap cm ys jagan) ప్రభుత్వం వాటి అభివృద్ధి చేస్తోందన్నారు. 


Also read: AP Corona Update: ఏపీలో రికార్డు స్థాయిలో కోవిడ్ పరీక్షలు..2 కోట్లు దాటిన పరీక్షలు, కోటి దాటిన వ్యాక్సినేషన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook