Chandrababu Naidu Bail: ‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు కేవలం మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద కోర్టు కండీషన్‌ బెయిల్‌ ఇచ్చింది. న్యాయం గెలిచిందని చెప్పే తెలుగుదేశం వారిని అడుగుతున్నా.. న్యాయం గెలిచిందా..? రోగం గెలిచిందా..?’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం అనంతపురం ఆర్‌ అండ్ బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కండీషన్‌ బెయిల్‌పై విడుదల కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ బాణసంచాలు కాల్చుకున్నారని.. ఇంకా కొందరైతే పొట్టేళ్లు నరకడం, జంతు బలి చేయడం చూస్తే సభ్యసమాజం తలదించుకునేలా హేయమైన చర్యలకు పాల్పడడం చాలా బాధాకరని అన్నారు. 73 ఏళ్ల వయసులో అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చంద్రబాబు క్యాంట్రాక్ట్‌ ఐ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు ధ్రువీకరణపత్రం ఇవ్వడంతో 28 రోజుల పాటు బెయిల్‌ ఇచ్చారని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"వయసు రీత్యా అనేక జబ్బులు ఉన్న చంద్రబాబుకు మానవతా దృక్పథంతో కేవలం చికిత్స కోసమే కండీషన్‌ బెయిల్‌ ఇచ్చారు. బెయిల్‌ అంశంలో ఎక్కడా కూడా కేసు పూర్వపరాలు గురించి ప్రస్తావించలేదు. ముందు నుంచి కూడా కోర్టు ఎక్కడా కూడా కేసులో చంద్రబాబు పాత్ర లేదనే విషయాన్ని వెల్లడించలేదు. కోర్టు నమ్మింది కాబట్టే ఆయనను అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత టీడీపీ శ్రేణులు విజిల్స్‌ వేయడం, తట్టాలు, స్పూన్లతో సౌండ్లు చేయడం, కొవ్వొత్తుల ర్యాలీ చేయడం, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేయడం తదితర విచిత్రమైన విన్యాసాలను నారా లోకేష్‌ ఆదేశాలతో చేపట్టారు. 54 రోజుల పాటు బలవంతంగా నిరసనలు తెలియజేశారు. ఎన్నడూ రాజకీయాల్లోకి రాని వారు కూడా చంద్రబాబు, లోకేష్‌ ఆదేశాల మేరకు బయటకు వచ్చి ఈ విచిత్ర విన్యాసాలు చేశారు. ఈ విచిత్ర విన్యాసాలకు చెక్‌ పడిందని, బలవంతపు నిరసనలు చేసే అవసరం లేదని టీడీపీ శ్రేణులు సంతోషంగా బాణసంచాలు కాల్చారు. 


చంద్రబాబు కండీషన్‌ బెయిల్‌పై విడుదల కావడంతో అత్యుత్సాహంలో ఆ పార్టీ శ్రేణులు ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో సభ్యసమాజం తలదించుకునేలా పొట్టేళ్లు నరికారు. చంద్రబాటు చిత్రఫటానికి పొట్టేళ్ల రక్తం చిందించారు. పైగా వాటిని వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఇలాంటి హేయమైన  చర్యలకు పాల్పడ్డారు. నిజంగా వారికి చంద్రబాబు మీద ప్రేమ ఉంటే గుడికి వెళ్లి ప్రార్థనలు చేయొచ్చు. అన్నదానాలు చేయొచ్చు. స్వీట్లు పంచుకోవచ్చు. అంతేకాని ఇలా నీచాతినీచంగా వ్యవహరించారు.." అని ఎమ్మెల్యే తోపుదుర్తి అన్నారు.


ఎంపీ మాధవ్‌ వ్యాఖ్యలను టీడీపీ నేతలు వాళ్లు వక్రీకవరించారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని.. దీంతో చంద్రబాబు రాజకీయంగా చనిపోతారని చెప్పారని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడంలో సిద్ధహస్తుడు ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం.. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు గెలిపిస్తూ ఉంటారని అన్నారు. చంద్రబాబు చికిత్స చేయించుకుని ఆరోగ్యంగా జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. 


Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు


Also Read: Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై కోడికత్తి దాడి అంటూ అపహాస్యం.. మంత్రి హరీష్ రావు కౌంటర్.!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి