Kejriwal on Modi: ప్రధాని చదువుకుని ఉండాలనేది అందుకేనంటూ మోదీపై కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు
Kejriwal on Modi: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2000 నోట్ల రద్దుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అందుకే ప్రధానిగా ఉన్న వ్యక్తి చదువుకున్నవాడై ఉండాలనేదంటూ ఎద్దేవా చేశారు.
Kejriwal on Modi: రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా నిన్న హఠాత్తుగా 2000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూ దేశ ప్రజలకు షాక్ ఇచ్చింది. ఆరేళ్ల క్రితం 2016లో డీమోనిటైజేషన్ పేరుతో పెద్దనోట్లను రద్దు చేయడంతో దేశ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఇప్పుడు మరోసారి 2 వేల నోటును రద్దు చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గట్టిగా స్పందించారు.
2016లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. అప్పటికి చలామణీలో ఉన్న 1000 రూపాయల నోట్లతో అవినీతి, బ్లాక్ మనీ పెరిగిపోయిందనే కారణాలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం..వేయి రూపాయలకు రెట్టింపు 2000 నోటును ప్రవేశపెట్టింది. 1000 రూపాయల నోట్లతో బ్లాక్ మనీ పెరుగుతుందని చెప్పినప్పుడు 2000 నోటు ప్రవేశపెట్టడమేంటనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. మరోవైపు 500 రూపాయల నోటును రద్దు చేసి కొత్త 500 రూపాయల నోటు ప్రవేశపెట్టింది. కరెన్సీ మార్చుకునేందుకు దేశ ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు కాసిన పరిస్థితి ఎవరూ మర్చిపోలేరు. దేశ ప్రజలు ఈ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు మరోసారి అదే రీతిలో ఆర్బీఐ షాక్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2000 రూపాయల నోటును రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దు చేసే ఉద్దేశ్యం ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ప్రధాని చదువు విషయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2000 నోటు రద్దు చేస్తూ ఆర్బీఐ చేసిన ప్రకటనతో దేశంలో గందరగోళ పరిస్థితి నెలకొందని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే ప్రధానిగా ఉన్న వ్యక్తికి చదువు ఉండాలని చెబుతారని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి చదువుకుని ఉంటే ఇలాంటి నిర్ణయాలుండవని తెలిపారు.
నిరక్షరాస్యుడైన మోదీకు ఎవరైనా ఏమైనా చెప్పగలరా అంటూ ఎద్దేవా చేశారు అరవింద్ కేజ్రీవాల్. 2000 నోటు తీసుకొస్తే అవినీతి ఆగిపోతుందని చెప్పారని..నోట్ల రద్దుతో అవినీత అంతమైందా అని ప్రశ్నిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. చదువుకోని వ్యక్తికి ఏం చెప్పినా అర్ధం కాదని..ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడతారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Also read: Karnataka New Government: కర్ణాటకలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, 8 మందితో తొలి కేబినెట్.. జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook