Ram Tweet on Jagan: కుట్ర జరుగుతోందంటూ హీరో ట్వీట్ కు కారణమదేనా
విజయవాడ కోవిడ్ సెంటర్ ( vijayawada covid centre ) అగ్నిప్రమాదంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హీరో రామ్ సైతం ఈ విషయంలో కలగజేసుకుంటూ వరుస ట్వీట్ లు చేయడం సంచలనమవుతోందిప్పుడు. పెద్దకుట్ర జరుగుతోందన్న రామ్ వ్యాఖ్యల వెనుక కారణమేంటి
విజయవాడ కోవిడ్ సెంటర్ ( vijayawada covid centre ) అగ్నిప్రమాదంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హీరో రామ్ సైతం ఈ విషయంలో కలగజేసుకుంటూ వరుస ట్వీట్ లు చేయడం సంచలనమవుతోందిప్పుడు. పెద్దకుట్ర జరుగుతోందన్న రామ్ వ్యాఖ్యల వెనుక కారణమేంటి
విజయవాడలోని స్వర్ణప్యాలేస్ ( swarna palace covid centre ) కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో విచారణ కమిటీ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా...డాక్టర్ రమేష్ ( Dr Ramesh )తో సహా స్వర్ణ ప్యాలేస్ హోటల్ యజమాని పరారీలో ఉన్నారు. స్కానింగ్ రిపోర్ట్ తో కోవిడ్ ఉందని చెప్పి చికిత్స పేరుతో లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు విచారణలో వెలుగుచూశాయి. ఈ నేపధ్యంలో హీరో రామ్ చేసిన ట్వీట్ ( Hero Ram tweet ) సంచలనమవుతోంది.
పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది..సీఎంని తప్పుగా చూపించడానికి..వైఎస్ జగన్ గారూ..మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కు, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం అంటూ రామ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు కారణమేంటనేది తెలుసుకోవాలంటే రామ్ కు రమేష్ హాస్పటల్ ( Ramesh Hospital ) కు ఉన్న సంబంధం గురించి తెలుసుకోవల్సి ఉంటుంది. విజయవాడ ఘటనలో రామ్ ఎందుకు జోక్యం చేసుకున్నారు. Also read: Ap Academic year: ఖరారైన విద్యాసంవత్సరం, సెప్టెంబర్ 5 నుంచే స్కూల్స్
అందర్నీ ఫూల్స్ చేయడానికి ఫైర్ నుంచి ఫీజుల వైపు మళ్లిస్తున్నారా అని మరో ట్వీట్ చేశారు. స్వర్ణ ప్యాలేస్ ని రమేష్ హాస్పటల్ వారు కోవిడ్ సెంటర్ గా మార్చకముందు ప్రభుత్వమే అక్కడ క్వారెంటైన్ సెంటర్ ( Quarantine centre ) నిర్వహించింది. అప్పుడు ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించేవాళ్లంటూ మరో ట్వీట్ చేశారు.
అసలు హీరో రామ్ ఎవరు..ప్రముఖ నిర్మాత ( Film producer ) స్రవంతి కిశోర్ ( Sravanti kishore ) కుమారుడే. ఇటు డాక్టర్ రమేష్ అయితే హీరో రామ్ కు స్వయానా అంకుల్. ఇద్దరి మధ్య ఉన్న దగ్గరి బంధుత్వమే ఉంది. బహుశా రామ్ అందుకే స్పందించి వరుస ట్వీట్లు చేసి ఉంటారని ఓ వర్గం చెబుతోంది. Also read: 74th Independence Day: ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం హైలైట్స్