Remdesivir Injections: రాష్ట్రంలో రెమ్‌డెసివిర్, ఐసీయూ బెడ్స్ కొరత నిల్
Remdesivir Injections: ఏపీలో కరోనా పరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుుడు పరిస్థితిని సమీక్షిస్తూ నియంత్రిస్తుండటంతో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధమైన కొరత లేదంటోంది ప్రభుత్వం.
Remdesivir Injections: ఏపీలో కరోనా పరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుుడు పరిస్థితిని సమీక్షిస్తూ నియంత్రిస్తుండటంతో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధమైన కొరత లేదంటోంది ప్రభుత్వం.
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ధాటికి కరోనా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ కొరత( Oxygen shortage), బెడ్స్,అత్యవసరమందుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఏపీలో కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నా పరిస్థితి మాత్రం అదుపులోనే ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నియంత్రిస్తుండటంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఏపీలోని ( AP) ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు(Remdesivir Injections) అందుబాటులో ఉన్నాయని..కొరత లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 23 వేల 685, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 18 వేల 94 రెమ్‌డెసివిర్ వయల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అటు రాష్ట్రంలో ఐసీయూ బెడ్స్ (ICU Beds) కూడా 918 ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 18 వేల కేసులే నమోదయ్యాయని..అదే సమయంలో 20 వేలమంది కోలుకున్నారని తెలిపారు.
Also read: AP Corona Update: ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి, పెరిగిన రికవరీ రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook