YS Jagan: సీఎం జగన్కు 3 ఇళ్లు.. అందుకే 3 రాజధానులా?: టీడీపీ ఎమ్మెల్యే
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో మూడు చోట్ల ఇళ్లు ఉన్నాయనే తరహాలో రాష్ట్రానికి మూడు రాజధానులు కట్టాలని నిర్ణయం తీసుకున్నారా అని రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ప్రశ్నించారు.
వార్డు సచివాలయం భవనాలకు అద్దె కట్టలేని ప్రభుత్వం మూడు రాజధానులు కడతామంటూ వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందంటూ రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ (Anagani Satya Prasad) ఎద్దేవా చేశారు. పరిపాలన చేతకాకపోతే ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకోవాలని, రాష్ట్ర ప్రజల జీవితాలను నాశనం చేయవద్దంటూ హితవు పలికారు. టీడీపీ ఎమ్మెల్యే ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. Jaya Prakash Reddy Death: జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలకు తనయుడు దూరం
‘వార్డు సచివాలయ భవనాలకు ప్రభుత్వం అద్దె సైతం చెల్లించడం లేదని యజమానులు వాటికి తాళాలు వేస్తున్నారు. ఉద్యోగులు రోడ్డు మీద పడుతున్నారు. కనీసం అద్దె చెల్లించనలేని ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా కడుతుందో అర్ధం కావడం లేదు. లేక వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో మూడు చోట్ల ఇళ్లు ఉన్నాయనే తరహాలో రాష్ట్రానికి మూడు రాజధానులు కట్టాలని నిర్ణయం తీసుకున్నారా.. Bigg Boss 4: పాపం గంగవ్వ.. ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యింది వీరే...
Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి
వైసీపీ జెండాకు మూడు రంగులున్నాయి కనుక మూడు రాజధానులు కడుతున్నారా. ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నిత్యం ఏడుస్తున్నారు. ఆడబిడ్డలు కన్నీరు పెడితే ఇంటికి మంచిది కాదు. రైతన్నల కన్నీరు దేశానికే మంచిది కాదు. మూడేళ్లు కాలయాపన చేయడం తప్ప.. మూడు ఇటుకలు కూడా పేర్చలేరని ఏపీ ప్రజలకు సైతం తెలిసిపోయిందంటూ’ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలనపై విమర్శలు చేశారు. Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు