Jaya Prakash Reddy Death: జయప్రకాష్‌ రెడ్డి అంత్యక్రియలకు తనయుడు దూరం

Jaya Prakash Reddy Dies at 74 | టాలీవుడ్ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) నేటి ఉదయం కన్నుమూయడం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నేడు కొరిటెపాడు శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. అయితే జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలకు ఆయన తనయుడు దూరంగా ఉండనున్నారు.

Last Updated : Sep 8, 2020, 12:07 PM IST
  • ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి కన్నుమూత
  • గుండెపోటుతో కుప్పకూలిపోయిన సీనియర్ నటుడు
  • జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియకులకు కుమారుడు దూరం
Jaya Prakash Reddy Death: జయప్రకాష్‌ రెడ్డి అంత్యక్రియలకు తనయుడు దూరం

ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) నేటి ఉదయం కన్నుమూయడం (Jaya Prakash Reddy Dies) తెలిసిందే. గుండెపోటు రావడంతో బాత్రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు జయప్రకాశ్ రెడ్డిని ఆస్పత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస (Jaya Prakash Reddy Passed Away) విడిచారు. ఆయన అంత్యక్రియలు నేడు కొరిటెపాడు శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. అయితే జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలకు ఆయన తనయుడు దూరంగా ఉండనున్నారని సమాచారం. Jaya Prakash Reddy Passed Away: నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత 

జయప్రకాశ్ రెడ్డి కుమారుడు, కోడలికి ఇటీవల కరోనా సోకింది. వీరు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగా నటుడు జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలకు ఆయన తనయుడు నిర్వహించలేకపోతున్నారు. దీంతో బంధువులు, సన్నిహితులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న సన్నిహితులు, మిత్రులు, ఆర్టిస్టులు గుంటూరు, విద్యానగర్‌లోని నటుడి ఇంటికి వెళ్తున్నారు. కరడుగట్టిన విలన్‌గా రాణించిన జయప్రకాశ్ రెడ్డి అనంతరం కమెడియన్‌గానూ పలు చిత్రాల్లో మెప్పించారు.   AP Unlock 4 Guidelines: ఏపీలో అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల 

Trending News